యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘థాంక్ యూ మీట్’ని నిర్వహించింది.
హీరో అశ్విన్ బాబు .. ‘హిడింబ’ ని పెద్ద విజయం వైపు తీసుకువెళుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో .. ఇది సాధ్యపాడుతుందా అని నేను, అనిల్ అనుకున్నాం. కానీ కొత్తదనం వుంటే మేము ఉన్నామని సినీ ప్రేక్షకులందరూ మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా వుంది. ‘హిడింబ’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి. బిజినెస్ అయ్యింది. డిస్ట్రిబ్యూట ర్స్ చాలా హ్యాపీగా వున్నారు.
ఈ వర్షంలో కూడా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి సూపర్ హిట్ అని చెప్పడం ఆనందంగా వుంది. అనిల్ సుంకర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మకరంద్ దేశ్ పాండే గారు మా సినిమాలో వుండటం అనందంగా వుంది. నందిత శ్వేత, రఘు అన్న ఎంతగానో సపోర్ట్ చేశారు. మా నిర్మాత శ్రీధర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. వికాస్ బడిసా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి మంచి పేరు రావడం ఆనందంగా వుంది.
కళ్యాణ్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. నేను ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫస్ట్ సీన్ ని ఎవరూ మిస్ అవ్వద్దు. అందులో స్క్రీన్ ప్లే థ్రిల్ వుంటుంది. అది మిస్ ఐతే మళ్ళీ సినిమాలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ సినిమాని బ్లెస్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ తెలిపారు.