హీరో శ్రీకాంత్ చేతులమీదుగా “రుద్రవీణ” లోని “బంగారు బొమ్మ” పాట విడుదల
రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల , ఎల్సా గోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ”. ఈ చిత్రం లోని “బంగారు బొమ్మ ” పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లాంచ్ అనంతరం
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… సాయి విల్ల సినిమాస్ బ్యానర్ పై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మించిన “రుద్రవీణ” టైటిల్ చాలా బాగుంది ఈ టైటిల్ మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన టైటిల్ .ఈ టైటిల్ చిరంజీవి అన్నయ్యకు మంచి పేరు తీసుకువచ్చింది. అప్పటి సినిమాలోని పాటలు ఎంతో మ్యూజికల్ హిట్ గా నిలిచి పోయాయి. అలాంటి గొప్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమానుండి విడుదలవుతున్న “బంగారు బొమ్మ” పాట విన్నాను. చాలా బాగా ఉంది. ఈ పాటలతో పాటు సినిమాలోని అన్ని పాటలు కూడా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులందరికి అల్ ద బెస్ట్ చెపుతున్నాను అన్నారు.
నటీ నటులు:
శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్ , శుభశ్రీ, రఘు కుంచె, ధనరాజ్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, సోనియా తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమా : “రుద్రవీణ”
సమర్పణ : రాగుల గౌరమ్మ
బ్యానర్ : సాయి విల్లా సినిమాస్
నిర్మాతలు : రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను
డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి
డి . ఓ. పి : జి. యల్ .బాబు
కోరియోగ్రఫీ :మొయిన్,రాజ్ పైడి
మ్యూజిక్ : మహావీర్
లిరిక్స్ : రాంబాబు గోశాల
ఎడిటర్ : బి. నాగేశ్వర్ రెడ్డి
ఆర్ట్ : భూపతి యాదగిరి
పి . ఆర్. ఓ : హరీష్ – దినేష్