ZEE5 ‘పులి-మేక’ పేరుతో కొత్త వెబ్ సిరీస్ ప్రారంభం
ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తుంది..ZEE5 ప్రారంభం నుండి ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది..ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ , ఇటీవల ‘రెక్కీ ‘తో ZEE5 మంచి హిట్ ను అందుకుంది .ఇప్పుడు తాజాగా “పులి – మేక” వెబ్ సిరీస్ ను లాంచ్ చేసింది ZEE5.
ZEE5 అసోసియేషన్ విత్ కోన ఫిలిం కార్పోరేషన్ , చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి – మేక”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటించడం విశేషం. గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & ZEE5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కిస్తున్న ‘పులి – మేక ’ వెబ్ సిరీస్ పూజ కార్యక్ర మాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. పూజ కార్యక్రమాల అనంతరం
తారాగణం: లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు.
సాంకేతిక నిపుణులు: వెబ్ సిరీస్ : పులి – మేక, బ్యానర్స్ : ZEE5 అసోసియేషన్ విత్ కోన ఫిలిం కార్పోరేషన్ దర్శకత్వం : చక్రవర్తి రెడ్డి . K
కెమెరా : సూర్య కళా, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్ : చోటా కె ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, మ్యూజిక్ : ప్రవీణ్ లక్కరాజు, కథా రచయిత : కోన వెంకట్ , వెంకటేష్ కిలారు.