కంటెంట్ కింగ్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి ‘రాజ రాజ చోర’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యూనిక్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’ తో అలరించడానికి రెడీ అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో 4 రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
1551 నుంచి మగవాడి ప్రయాణం అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్వాగనిక రాజవంశంలో ప్రతి రాజు మగ వారసుడిని కలిగి ఉండాలని కోరుకుంటాడు. అయితే, 1970ల నుండి ఈ వంశానికి చెందిన యయాతి సాదాసీదా జీవితాన్ని గడుపుతాడు. అతనికి కుమార్తెలు మాత్రమే వుంటారు. మరొక యుగానికి చెందిన భవభూతి, సింగ తన వారసుడిని తెలుసుకుంటాడు. రాజవంశం నిధిని అప్పగించడం అతని బాధ్యత. అయితే, వింజమర రాణి దిన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.
విభిన్న టైమ్‌లైన్‌లలో సెట్ చేయబడిన కథ, జెండర్ గేమ్స్ ని ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. దర్శకుడు హసిత్ గోలి ఈ ట్రైలర్ ద్వారా ప్లాట్‌ను క్లారిటీ, ఇన్ సైట్ తో అందించారు. శ్రీవిష్ణు 4 డిఫరెంట్ గెటప్‌లలో అద్భుతమైన నటన కనబరిచారు. భిన్నమైన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ లతో అలరించారు. భవభూతి పాత్ర ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.
రీతూ వర్మకు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తన రీఎంట్రీలో చేస్తున్న చిత్రంలో చాలా కీలక పాత్రను పోషించింది. దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ఫన్ అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వున్నాయి. వేదరామన్ శంకరన్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ ఎక్స్ లెంట్ స్కోర్‌తో ట్రైలర్ ని మరింతగా ఎలివేట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతగా వున్నాయి. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, నందు మాస్టర్ స్టంట్ డైరెక్టర్. అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ అల్టిమేట్ డోస్ ట్రైలర్‌తో అంచనాలని మరింతగా పెంచింది.
Cast : Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Daksha Nagarkar, Saranya Pradeep
Sunil, Ravi Babu, Getup Srinu, Gopa Raju Ramana
Technical Crew :
Producer by T.G. Vishwa Prasad
Written & Directed by Hasith Goli
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Cinematographer: Vedaraman Sankaran
Music: Vivek Sagar
Editor: Viplav Nyshadham
Art Director: GM Shekar
Stylist: Rajini
Choreography: Sirish Kumar
Stunts: Nandu Master
Publicity Designs: Bharanidharan
Executive Producer: Anunagaveera
Lyrics: Bhuvana Chandra, Ramajogayya Sastry, Jonnavithula, Nikhilesh Sunkoji, Swaroop Goli
Sound Design: Varun Venugopal Co-Director: Venki Surendar (SURYA)
VFX & DI: Deccan Dreams
Colorist: Kiran
VFX Supervisor: V Mohan Jagadish (JAGAN)
Cartoon Anime: Thunder Studios
Direction Team: Praneeth, Bharadwaj, Prem, Shyam, Karimulla, Swaroop
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్