Karthikeya 2 : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నటుడు నిఖిల్ సిద్ధార్థ్. తొలి సినిమాలోనే తనదైన నటనతో యూత్‌ను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ, సుబ్రమణ్యపురం, ఎక్కడికి వెళతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం ఇలా వరుస విజయాలను అందుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ఇక ఇటీవలే చందు ముండేటి దర్శకత్వంలో “కార్తికేయ-2” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
చిన్న సినిమాగా వచ్చి, పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సక్సెస్ ను అందుకుంది ఈ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు నిఖిల్. కాగా ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుందని తెలుస్తుంది. అమెరికాలో కూడా ఈ చిత్రం అఖండమైన విజయాన్ని అందుకోవడంతో.. ‘న్యూ జెర్సీ ఎడిసన్’ మేయర్ హీరో నిఖిల్ ని గౌరవ పత్రం ఇచ్చి అభినందిచారు. “కార్తికేయ-2లో కనబరిచిన నిఖిల్ నటన అద్భుతం” అంటూ ఆయన నిఖిల్ ని అభినందించారు.
ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నిఖిల్. ఆ పోస్ట్ లో “ఇంతటి గౌరవం అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే స్నిమలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.