Telugu World Now
No Result
View All Result
Wednesday, July 2, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Business Analysis

SALAAR Movie Review : ఒక తెలుగువాడు హాలీవుడ్ త‌ర‌హా విశ్వ‌రూప విన్యాసం Review by Journalist Audi

SALAAR Movie Review by journalist Audi, Director Prashanth Neel, Hero Prabhas, Prithviraj Sukumaran, Shruti Hassan, Jagapathi Babu

Sowmya by Sowmya
December 29, 2023
in Entertainment, Film News

స‌లార్ రివ్యూ  :

సినిమా ఎలా ఉంది? అంటే ఇదే చిత్రంలో ఒక ముస‌ల‌మ్మ‌ పాత్ర ప్ర‌భాస్ ను తాకి చూసి.. ఒక మాట అంటుంది.. ఇది నిజ‌మేనా? అని. ఒక తెలుగువాడు హాలీవుడ్ త‌ర‌హా విశ్వ‌రూప విన్యాసం ఇందులో చూసే ప్రేక్ష‌కుల‌కు కూడా స‌రిగ్గా ఇలాంటి అనుభూతే త‌ప్ప‌క క‌లుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలుగు సినిమా స్వ‌రూప స్వభావాల‌ను పూర్తిగా మార్చివేసే కొంద‌రంటే కొంద‌రు ద‌ర్శ‌కుల్లో ప్ర‌శాంత్ నీల్ ఒకడు. కాదు ఒకే ఒక్క‌డుగా చెప్పాలి.. కొన్ని అంచ‌నాల ప్ర‌కారం.. ప్ర‌శాంత్ నీల్ న‌మోదు చేస్తున్న ఈ చిత్ర‌విచిత్ర‌ బీభ‌త్స‌కాండ‌ను చూసి.. రాత్రిళ్లు నిద్ర ప‌ట్ట‌ని ద‌ర్శ‌కులు చాలా మందే ఉండి ఉండొచ్చు.. సుకుమార్, రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కులు చెప్పే స్టోరీ టెల్లింగ్ కీ ఈ విధానానికి చాలా చాలా తేడా.. కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం ఫీల్డ్ ని ఏలుతున్న రాజ‌మౌళికైతే, అస్స‌లు జీర్ణించుకోలేని విష‌యంగా ప్ర‌శాంత్ నీల్ ప్ర‌తిభ కావ‌చ్చు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌రకూ రాజ‌మౌళి ఒక అగ్ర ద‌ర్శ‌కుడిగా ఉన్నాడంటే అందుకు కార‌ణం.. క‌థ‌కుడైన తండ్రి. త‌ర్వాత అత‌డి ఇంటిల్ల పాది చేసే కృషి. ఇలాంటివేవీ లేకుండా ప్ర‌శాంత్ నీల్ ఇలాంటి ఊహాజ‌నిత గాథ‌ల‌ను వ‌రుస పెట్టున తెర‌కెక్కించడం అంత మామూలు విష‌యం కాదు. ఇలాంటి క‌థ‌నాల‌ను వండి వార్చ‌డానికి ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ అత‌డు త‌న బాల్యంలో త‌న బామ్మ లేదా మామ్మ‌లు చెప్పిన చిత్ర విచిత్ర‌మైన క‌థ‌ల‌ను అనుస‌రించి.. వాటి ద్వారా ఒక ఊహాజ‌నిత‌మైన క‌థా సృజ‌న అబ్బి ఉండాలి.

ఇలాంటిదొక‌టి సాధ్య‌మ‌వుతుందా? అని చూస్తే.. మా చిన్న‌ప్పుడు మునెమ్మ అనే ఒకానొక మ‌హిళ రాత్రిళ్లు మాకు అప్ప‌టి వ‌ర‌కూ మేము విన‌ని.. క‌నీ వినీ ఎరుగ‌ని.. భ‌యాన‌క‌మైన క‌థ‌లు చెప్పేవారు. ఒకే వ‌రండాలో ఉండే ఇళ్ల‌లోని పిల్ల‌లంద‌రూ ఆమె చెప్పే క‌థ‌ల‌ను విన‌డానికి ఎంతో ఆస‌క్తి చూపేవారు. ఆ క‌థ‌లు కూడా స‌రిగ్గా ఇలాగే ఉండేవి.. వాటిలో కూడా ఇలాంటి కాటేరీ క‌థ‌లు వినిపించేవి. ఒక్కోసారి ఆ క‌థ‌లు వినే పిల్ల‌లు త‌మ లాగూలు త‌డిపేసుకునేవారు. మరి కొంద‌రైతే ఆ క‌థ‌లు వింటూ వింటూ భ‌యానికి లోనై ఏడుస్తూ ఇళ్ల‌కు వెళ్లిపోయేవారు. ఆ పిల్ల‌లు జ‌డుసుకోవ‌డంతో వారిని ఎత్తుకొచ్చిన త‌ల్లులు.. కాటేరి క‌థ‌ల‌- మునెమ్మ‌ను తిట్టిపోసేవాళ్లు.

ఇలాంటి బాల్యం ఏదో ప్ర‌శాంత్ నీల్ కి ఉండాలి. లేకుంటే అత‌డికిలాంటి క‌థా ర‌చ‌నా సామ‌ర్ధ్యం ఎలా సాధ్యం? ఆ రోజుల్లో వీధి బ‌డిలో చ‌దువుకున్న‌ షేక్స్ పియ‌ర్.. రాచ‌వాడ‌ల అంత‌రంగిక‌ వ్య‌వ‌హారాల‌ను.. తానేదో ప‌ర‌దాల మాటున ఉండి చూసిన‌ట్టు రాయ‌టం చూసి చాలా మందికి ఇదే అనుమానం. అప్ప‌ట్లోనే షేక్స్ స్పియ‌ర్ ను ఒక‌ కాపీ క్యాట్ గా భావించేవారు. అవ‌స‌లు అత‌డి సొంత ర‌చ‌న‌లుగా ఎవ‌రూ పెద్దగా న‌మ్మేవారు కాదు. షేక్స్ పియ‌ర్ లోని ర‌చ‌నా ప్ర‌తిభ‌ను సాటి ర‌చ‌యిత బెంజిమ‌న్ ఒక్క‌డే న‌మ్మేవాడట‌. ఆపై షేక్స్ పియ‌ర్ ఇంగ్లీష్ పాఠాలకే ఒక పాఠంగా నిలిచిపోవ‌టం అంద‌రికీ తెలిసిందే. విలియ‌మ్ షేక్స్ పియ‌ర్ ను చ‌ద‌వ‌కుండా ఏ బాల్యం గ‌డిచేది కాదంటే అతిశ‌యోక్తి కాదేమో.

ఇక్క‌డి విష‌యానికి వ‌స్తే ప్ర‌శాంత్ నీల్ కి ఇలాంటి క‌థా గ‌మ‌న చిత్రణ.. ఎలా సాధ్య‌మైంది? ఇలాంటి ప్ర‌పంచాలుంటాయ‌నీ.. సాదాసీదా కృష్ణాన‌గ‌ర్\ ఇంద్ర‌న‌గ‌ర్ గ‌డ్డ‌\ఫిలిమ్ న‌గ‌ర్ లో తిర‌గాడే.. సినీజ‌నానికి వ‌శ‌ప‌డే విష‌యాలు.. కావు. ఖాన్సార్ అనే ఒక ఊహాజ‌నిత ప్ర‌పంచాన్ని సృష్టించ‌డం మాత్ర‌మే కాకుండా.. అక్క‌డి రాచ‌రిక‌పు వ్య‌వ‌హారాలు.. కుర్చీలాట‌లు.. వాటి మ‌ధ్య న‌డిచే సీజ్ ఫైర్ నిబంధ‌న‌లు.. వారి వారి రాజ్యాంగపు ర‌చ‌న‌లు. ఆయా వ్య‌క్తులు\శ‌క్తుల మ‌ధ్య సాగే రాజ‌కీయ‌పు కొట్లాట‌లు.. ఇవ‌న్నీ మామూలు ద‌ర్శ‌కుల‌కు ఊహ‌కు కూడా అంద‌ని విన్యాసాలు.

కొంద‌రు ప్ర‌శాంత్ నీల్ త‌న స‌లార్ చిత్రంలోని కొన్ని స‌న్నివేశాల‌ను అక్క‌డా ఇక్క‌డా.. కాపీ కొట్టాడ‌ని ఒక క్రోనాల‌జీని వాకృచ్చుతున్నారు కానీ అంత మాత్రం చేత ఇలాంటి ఐకానిక్ క‌థ‌నాన్ని రూప‌క‌ల్ప‌న చేయ‌డం అంత తేలిగ్గా సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. దాస‌రి నారాయ‌ణ రావు అనే దివంగ‌త ద‌ర్శ‌కుడ‌న్న‌ట్టు.. ఒక‌వేళ ఉన్నా కూడా.. అది కేవ‌లం ప్రేర‌ణ మాత్ర‌మే త‌ప్ప‌.. పూర్తి కాపీగా కొట్టిపారేయ‌లేం. ఆ మాట‌కొస్తే.. శంక‌రాభ‌ర‌ణం అనే ఒక ముస‌లాడి క‌థ‌ను చూసి ఇన్ స్పైర్ అయిన దాస‌రి మేఘ‌సందేశం తీశారు. అంత మాత్రం చేత దాస‌రి ద‌ర్శ‌క ప్ర‌తిభ‌ను కాపీ గా కొట్టి పారేయ‌లేం క‌దా.

సుకుమార్ లాంటి ద‌ర్శ‌కులు ఇలాంటి ప‌నులు చేసిన‌ట్టుగా చ‌రిత్ర ఉన్న మాట వాస్త‌వం. సుకుమార్ రంగ‌స్థ‌లం, పుష్ప రెండూ కాపీ క‌థ‌నాలే అన్న మాట ప్ర‌చారంలో ఉంది. బేసిగ్గానే సుకుమార్ త‌న‌కు తాను బెస్ట్ స్టోరీ టెల్ల‌ర్ గా చెప్పుకోవ‌డం మాత్ర‌మే కాదు.. త‌న పేరిట సుకుమార్ రైటింగ్స్ అనే ఒక నిర్మాణ సంస్థ పెట్టుకుని వాళ్ల‌వీ వీళ్ల‌వీ అక్క‌డా ఇక్క‌డా క‌థ‌లు లేపేసి.. తీస్తాడ‌నే పేరుంది. ఆ మాట‌కొస్తే ఉప్పెన మ‌డ్ బౌండ్ అనే హాలీవుడ్ చిత్రానికి న‌ఖ‌లుగా చెబుతారు.

లాల్ సింగ్ చ‌ద్దా, ఫారెస్ట్ గంప్ నుంచి ప్రేర‌ణ పొందిన‌ట్టు.. ఇదే భ‌గ‌వంత్ కేస‌రి చిత్రానికి కూడా ఇన్ స్పిరేష‌న్ గానూ చెబుతారు. ఇలాంటి స్ప‌ష్ట‌మైన ఆధారాలేవీ ప్ర‌శాంత్ నీల్ కాపీ కొట్టిన‌ట్టు మ‌న‌కేమీ క‌నిపించ‌దు.. ఒక‌టీ అరా ఎక్క‌డి నుంచైనా కాపీ కొట్టినా.. ఆ చిత్ర‌ణ‌లోని గాంభీర్య‌త‌.. ఒళ్లు జ‌ల‌ద‌రింప చేసే దృశ్య రూప విన్యాసం చేయ‌డం అంతే సులువైన ప‌నేం కాదు. ఇలాంటి దృశ్యాలు చాలానే చిత్రించాడు నీల్.

హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ లో ఏవో ఆకృతులు అత‌డి బ్యాగ్రౌండ్ లో క‌ద‌లాడుతుంటాయి. అవి చైనీస్ డ్రాగ‌న్ త‌ర‌హా లో క‌నిపిస్తాయి. స్క్రీన్ లోని ప్ర‌తి స్పేస్ ని బ‌ర్న్ చేస్తూ ఉండ‌టం.. త‌ద్వారా తాను ఏదో చెప్ప‌ద‌లుస్తాడు ప్ర‌శాంత్. ఆ కోట‌గోడ‌లు, వాటిలోని ప్ర‌తిమ‌లు.. ఆ గ్రూపులు.. వాటి వాటి పేర్లు… మ‌న‌కు ఇక్క‌డ ఎక్క‌డా అందుబాటులో ఉన్న‌ట్టుగానే క‌నిపించ‌వు. ఈ సినిమాను ఇలాగే యాజ్ ఇటీజ్ ఇంగ్లీష్ లో డ‌బ్ చేస్తే ఇది పాన్ వ‌ర‌ల్డ్ మూవీ అవుతుంద‌న‌డంలో అనుమాన‌మే లేదు. అంత భారీ క్యాస్టింగ్.. వాటి ద్వారా తాను ప‌ల‌క‌ద‌లుచుకున్న భాష\ భావం చాలా చాలా ప్ర‌త్యేకంగా క‌నిపిస్తాయి.

సినిమాలో కొన్ని కొన్ని మాన్యుమెంట‌రీ మూమెంట్స్ ద‌ర్శ‌న‌మిస్తాయి. ఫ‌స్ట్ ఫైట్. త‌ర్వాత కాటేరిని కొలిచే తెగలోని బాలిక‌ను కాపాడే స‌మ‌యంలోని స‌న్నివేశం. ఇలా చాలానే మిరాకిల్స్ క్రియేట్ చేశాడు ప్ర‌శాంత్ నీల్. ఇంట్రోలో చైల్డ్ హుడ్ ఫైట్ సైతం.. మ‌న‌మింత వ‌ర‌కూ చూడ‌నిదే. హీరో పెద్ద‌య్యాక ఫ‌స్ట్ ఫైట్ సైతం.. గూస్ బంప్ రేంజ్ లో ఉంటుంది. హీరోలో ఆవేశం వ‌చ్చేట‌ప్ప‌టి జీప్ ఆరార్.. కూడా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక భీతావ‌హంగా క‌నిపించే కాటేరి.. సీన్ లో షాడో ఎఫెక్ట్.. కూడా వండ్ర‌ఫుల్ గా క‌నిపిస్తుంది.

ప్ర‌శాంత్ నీల్ టెక్నిక్ ఏంటంటే.. తానొక సినిమా క‌థ‌ను వండి వార్చ‌డానికి ఎమోష‌న్స్, దాని తాలూకూ తీవ్ర‌త‌ను ప్ర‌ధానాస్త్రాలుగా సిద్ధం చేసుకుంటాడులా ఉంది చూస్తుంటే. ఒక హీరోని ఎంత భారీగా.. ఎంత భీతావ‌హంగా.. ఎంత బీభ‌త్సంగా.. చిత్రీక‌రించాలో మొద‌ట ఊహించుకుని, ఆ ఇమాజినేష‌న్ కి త‌గిన క‌థ‌నాన్ని రెడీ చేస్తాడులా ఉంది. హై ఓల్టేజ్ సీన్ మేకింగే ప్ర‌శాంత్ నీల్ మెయిన్ స్ట్రెంగ్త్. అదే అత‌డిని ఈ స్థాయి ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టింద‌ని చెప్పాలి. కొంద‌రు తూతుంబ‌ర్ గాళ్లు, టాలాటోలీ మేతావులు అనుకున్నంత అతి సామాన్యుడేం కాడు ప్ర‌శాంత్ నీల్. మ‌న కాలంలో మ‌నం చూస్తోన్న యూనివ‌ర్శ‌ల్ డైరెక్ట‌ర్. క‌మ‌ల్ త‌ర్వాత ఆ రేంజ్ పేరు సాధించిన ఒకే ఒక్క‌డు ఇత‌డే. ఇది ఏమంత మామూలు విష‌యం కాదు.

బేసిగ్గా ఇలాంటి క‌థ‌ల‌ను ఊహించ‌డానికే స‌గం జీవితం స‌రిపోతుంద‌నుకుంటే వాటిని ఎక్క‌డా బెస‌క్కుండా.. ఒకే ప‌ట్టు మీద నిల‌బెట్టుకు రావ‌డం. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఇట్స్ నాటే ఈజీ థింగ్. మైండ్ బ్లోయింగ్\ అన్ బిలీవ‌బుల్.. అనే విశేష‌ణాలు కూడా చాలా చాలా చిన్న‌వై పోతాయ్. ఒక మూడ్ లో ఉండి.. క‌థ‌ను ఊహించ‌డం మాత్ర‌మే కాకుండా.. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రీక‌రించ‌డంలో.. నీల్ ది ఎక్స్ ట్రార్డిన‌రీ లెవ‌ల్ ఆఫ్ థింకింగ్ క‌మ్ మేకింగ్ మూమెంట్ గా చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్ర‌శాంత్ నీల్ ప్ర‌శంసార్హుడు\ చ‌రితార్ధుడు.. ఇంకా ఇంకా చాలానే విశేష ప‌దాల‌కు అస‌లు సిస‌లు అర్హుడు. బేసిగ్గా ఒక డైరెక్ట‌ర్ కెరీర్ లో ఒకే ఒక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. కానీ ఒక ద‌ర్శ‌కుడి జీవిత కాల‌మంతా డ్రీమ్ ప్రాజెక్టులు చిత్రీక‌రించేంత ద‌ర్శ‌క సామ‌ర్ధ్యం ఉంటే వాడు ప్ర‌శాంత్ నీల్ అవుతాడు.

త‌న‌ త‌ర్వాత మూవీ స్టెప్ ఏంటో అన్న హైప్ ఒక‌టి క్రియేట్ చేసి.. త‌ద్వారా ఒక మేనియా క్రియేట్ చేసి.. మాస్ ఆడియ‌న్స్ ని ఉర్రూత‌లూగిస్తూ.. ఓల‌లాడిస్తూ.. వారి చేత ఈల‌లేయిస్తూ.. గోల‌చేయిస్తూ.. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల వ‌ర‌ద పారిస్తూ.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్ర‌శాంత్ అని పేరు పెట్టుకుని ఎంద‌రో ద‌ర్శ‌కుల‌కు ప్ర‌శాంత‌త లేకుండా చేస్తోన్న ఏకీ ఏక్.. నీల్ కి మ‌నం కంగ్రాట్స్ చెప్ప‌డం కూడా చాలా చాలా చిన్న విష‌య‌మే అవుతుంది. దానికి తోడు ఇప్పుడే అన్ని ప్ర‌శంస‌లూ క‌క్కేస్తే.. అబ్బో అత‌డింకా తీయ‌బోయే చాలా చాలా మాన్యుమెంట‌రీ మూవీస్ చూడాలి. మ‌ళ్లీ అక్ష‌రాల‌నిలా పోగేయాలి. రాస్తూ రాస్తూ పోవాలి.. కాబ‌ట్టి ఇక్క‌డితో సె. ల‌. వు!

SALAAR Movie Review by Senior Journalist Audi

Source: SALAAR Movie Review by journalist Audi, Director Prashanth Neel, Hero Prabhas, Prithviraj Sukumaran, Shruti Hassan, Jagapathi Babu
Via: SALAAR Movie Review by journalist Audi, Director Prashanth Neel, Hero Prabhas, Prithviraj Sukumaran, Shruti Hassan, Jagapathi Babu

Related Posts

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల
Film News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”
Film News

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ
Film News

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం
Film News

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక
Film News

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు
Film News

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్
Film News

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్
Film News

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్
Film News

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్
Film News

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

IAS officer Divya Devarajan assures free treatment for head injuries after car tire burst in Saudi Arabia, Ptavasi Prajavani, CM Revanth Reddy, Saudi News, Telugu World Now

Saudi Arabia News : సౌదీలో కారు టైరు పేలి తలకు గాయాలు

July 1, 2025
Journalists pay tribute to freedom, condolence meeting at JCHSL office, The Journalists Cooperative Housing Society Managing Committee, Allam Narayana, Telugu World Now

స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి – JCHSL కార్యాలయం లో సంతాప సభ

July 1, 2025
Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

IAS officer Divya Devarajan assures free treatment for head injuries after car tire burst in Saudi Arabia, Ptavasi Prajavani, CM Revanth Reddy, Saudi News, Telugu World Now

Saudi Arabia News : సౌదీలో కారు టైరు పేలి తలకు గాయాలు

July 1, 2025
Journalists pay tribute to freedom, condolence meeting at JCHSL office, The Journalists Cooperative Housing Society Managing Committee, Allam Narayana, Telugu World Now

స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి – JCHSL కార్యాలయం లో సంతాప సభ

July 1, 2025
Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us