ప్రముఖ నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తోన్న చిత్రం “కాప్”. శత్రుపురం, ‘మన్యం రాజు’ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొన్న దర్శకుడు బి. సోముసుందరం ఈ “కాప్” చిత్రానికి దర్శకత్వం వహించారు.
పొలిటికల్ సెటైర్స్ తో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం వుంటుంది.. అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సోము.. కాగా ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ఏప్రిల్ 12న తిరుపతి ఎస్ వి ఇంజినీరింగ్ కాలేజ్ లో వందలాదిమంది స్టూడెంట్స్ మధ్య వైభవంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనంతరం ఎస్వీ కాలేజ్ డైరక్టర్ డా. యన్. సుధాకర్ రెడ్డి స్వశ్రీ బ్యానర్ లోగోనీ ఆవిష్కరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటులు కేజియఫ్ ఫేం హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, మ్యూజిక్ డెరైక్టర్ మిలన్ జోషి, ఫైట్ మాస్టర్ కుంగ్ ఫు సెంథిల్, కో- ప్రొడ్యూసర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.