కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఎఫ్ఐఆర్ ట్రైలర్‌ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
2 నిమిషాల 12 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అబూ బక్కర్ అబ్దుల్లా అనే భయంకరమైన టెర్రరిస్ట్ కారణంగా ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయనేది చిత్ర కథగా చూపించారు. ఇర్ఫాన్ అహ్మద్ పాత్రలో విష్ణు విశాల్ ఈజ్‌తో నటించాడు. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక తీవ్రవాదులని నిర్మూలించే ఆఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటన ప్రత్యేకంగా నిలిచింది. మంజిమా మోహన్ స్క్రీన్ ప్రజెన్స్ ప్లజంట్‌గా ఉంది. అరుల్ విన్సెంట్ కెమెరా పనితనం, అశ్వంత్ సంగీతం ఈ సినిమాకు మేజర్ హైలెట్స్ అని చెప్పొచ్చు. ఇక డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.నటీనటులు : విష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రేబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు
సాంకేతిక వర్గం: నిర్మాత – విష్ణు విశాల్, రచన,దర్శకత్వం – మను ఆనంద్, సమర్పణ- రవితేజ, డిఓపి- అరుల్ విన్సెంట్, రిలీజ్- అభిషేక్ పిక్చర్స్, మ్యూజిక్- అశ్వంత్, ఎడిటర్- ప్రసన్న జీకే, స్టంట్స్- స్టన్ శివ, పాటలు – రాకేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – అనిత మహేంద్రన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – సీతారాం స్రవంతి సాయినాథ్ దినేష్ కర్ణం.