Crime చావు ఎప్పుడైనా ఎటు నుంచైనా రావచ్చు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. క్షణకాలంలో ప్రాణాలు పోతుంటాయి. ఈ మధ్య కాలంలో గమనిస్తే హఠాన్మారణాలు కాస్త ఎక్కువైపోయాయనే చెప్పాలి.
కళ్లముందే ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి ఉన్నట్టుండి ఊపిరి వదిలేస్తున్నాడు. తాజాగా గణేష్ ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన చేస్తూ ఓ కళాకారుడికి ఇదే జరిగింది. డాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఓ వ్యక్తిని లేపడానికి ఎంత ప్రయత్నించినా లేవలేదు దీంతో అనుమానం వచ్చి చూడగా ప్రాణాలు విడిచాడు. ఉన్నట్టుండి ప్రాణాలు విడిచాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురి సమీపంలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో విషాదం నెలకొంది. హనుమంతుడి వేషదారణలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉన్న రవి శర్మ(35) అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలి.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
#मैनपुरी
गणेश मूर्ति पंडाल में युवक नाचते समय बेहोश होकर गिराहनुमान जी का रूप धर नाच रहा था युवक
जिला अस्पताल में डॉक्टरों ने मृत घोषित किया
मैनपुरी सदर कोतवाली के मोहल्ला बंशीगोहरा का मामला@mainpuripolice #HanumanJi #GaneshUtsav #network10 #ekdarpan pic.twitter.com/clHPTZSWm4
— Network10 (@Network10Update) September 4, 2022
అప్పటివరకు ఎంతో హుషారుగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేసిన వ్యక్తి మండపంలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల భక్తులు షాక్‌కు గురయ్యారు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని మెయిన్పూర్ జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజమే జీవితం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు.. ప్రాణం పోవడానికి ఒక క్షణం చాలు…