Mango for Weight Loss : మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఈ పండ్లని చాలా మంది ఎంతగానో ఇష్టంగా తింటారు. పండ్ల రారాజు మామిడిపండు. వీటిని తినడమంటే ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. సీజన్ వచ్చింది మొదలు అయిపోయవరకూ రోజూ కచ్చితంగా తినాల్సిందే. అయితే, వీటిని తినడం వల్ల బరువు పెరుతారని చాలా మందికి అనుకుంటారు. కానీ, వీటిని సరిగ్గా తింటే బరువు తగ్గొచ్చు .
మామిడిలోని పోషకాలు..
మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి.
విటమిన్ సి,
విటమిన్ ఇ,
విటమిన్ బి6,
ఫోలేట్,
ఐరన్,
మెగ్నీషియం
ఫైబర్స్,
యాంటీ ఆక్సిడెంట్స్
అందరికీ ఇష్టమైన మామిడి..
మామిడిపండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. వేసవిలో మాత్రమే లభించే ఈ పండుని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ తిని ఎంజాయ్ చేస్తారు. ఈ సీజన్‌లో మామిడి కాయల్ని, పండ్లని అన్నింటిని ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా తిని ఆనందపడతారు. అయితే, వీటిని తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
బరువు తగ్గడం..
మామిడి పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ కారణంగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని వల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది. మామిడిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మితంగా, అంటే తక్కువగా తింటే బరువు తగ్గుతారు. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారని గుర్తుపెట్టుకోండి.
కొలెస్ట్రాల్ తగ్గడం..
మామిడి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
ఈ పండులోని మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి చాలా మంచివి. ఇవన్నీ మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.