Natural Scrub : పప్పులు ఆహారంలానే కాధు అందాన్ని కాపాడడానికి కూడా ఉపయోగపడతాయి .. వీటిని చంధనం తో వాడితే ఇంకా మంచి రిసల్ట్ వుంటాయి …
మైసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు. చూడ్డానికి కందిపప్పులానే ఉన్నప్పటికీ ఇది కాస్తా ఆరేంజ్ కలర్‌లో ఉంటుంది. దీనిని ఎంతో రుచిగా వండుకోవచ్చు. అయితే, దీనిని చర్మానికి కూడా అప్లై చేయొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. దీనిని ఫేస్ ప్యాక్‌లా చేసి వాడితే చర్మం మెరుస్తుందని చెబుతున్నారు.
స్క్రబ్..
ఈ మైసూర్‌ని పప్పుని స్క్రబ్‌లా వాడొచ్చు. దీనిని వాడడం వల్ల రంధ్రాలు కూడా తగ్గుతాయి. దీంతో స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ట్యాన్ తగ్గి బ్రైట్‌గా మారుతుంది. ఎలా వాడాలి. దీనికోసం ఏమేం కావాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..
పచ్చిపాలు ఎర్రకందిపప్పుతో..
ముందుగా పచ్చిపాలలో ఎర్రకందిపప్పు వేసి నానబెట్టాలి. దీనిని మెత్తగా పేస్ట్‌లా చేయండి. ఇలా తయారైన పేస్ట్‌ని ముఖాన్ని క్లీన్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కొద్దిగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మొహం లో ఇన్స్టంట్ గ్లో వస్తుంది .
అలాగే కొంచం బాదం నూనె తీసుకొని దానిలో ఎర్రకందిపప్పు ని పొడి చేసి ,ఆ పొడి ని ఆ బాదం నూనె లో కలిపగా వచ్చిన మిశ్రమాన్ని ఫేస్ పైన అప్లై చేస్తూ స్క్రబ్ చేసి ఒక 10 నిమిషాల తరువాత వాష్ చేస్తే చాలు ఫేస్ నీట్ గా కనిపిస్తుంది
బాదం నూనె, మైసూపర్ పప్పు రెండు కూడా ముఖంపై టాన్‌ని దూరం చేసి స్కిన్ బ్రైట్‌గా అయ్యేలా చేస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల ఈవెన్ స్కిన్ మీ సొంతమవుతుంది.
మైసూర్ పప్పు, కొబ్బరినూనెతో.
ఈ రెండింటి కలయిక కూడా చర్మాన్ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. కొబ్బరి నూనె మీ చర్మాన్ని తేమగా చేస్తుంది.
పప్పుని మెత్తగా మిక్సీ పట్టి.. అందులో కొద్దిగా పాలు, కొబ్బరినూనె వేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత స్క్రబ్‌లా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి
చందనంతో..
పప్పు పొడిలో చందనాన్ని కలిపి రాయడం వల్ల ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి.