Lemon And Fenugreek Water : ప్రతిరోజూ ఉదయాన్నే మెంతల నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు . మెంతుల నీరు తాగడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి, బరువు తగ్గడం , జీర్ణక్రియ మెరుగుపడడం జరుగుతాయి . మెంతుల నుండి గరిష్ట ప్రయోజనాలను ఎలా పొందాలంటే దానికి నిమ్మకాయ నీరు జోడిస్తే సరిపోతుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే మెంతి నీరు త్రాగడం వల్ల బరువు తగ్గే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఆరోగ్యంగా, మరింత శక్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతి , నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. మెంతిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండా ఉంచి, అల్పాహారం మరియు అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది
నిమ్మరసం నీరు, క్రమం తప్పకుండా తీసుకుంటే, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది, ఇది కొవ్వును కరిగించటానికి తోడ్పడుతుంది. మెంతి, నిమ్మరసం ఈ రెండింటినీ కలపడం వల్ల బరువు తగ్గించే ప్రక్రియను మరింత వేగవంతం అవుతుంది.
ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరం ఆహారం నుండి ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది. బరువును సులభంగా తగ్గేలా చేస్తుంది.
వాస్తవానికి దీనిని తయారు చేయటం సులభం. ఇందుకోసం ముందుగా 1 టీస్పూన్ మెంతి గింజలు, సగం నిమ్మకాయ , 1 కప్పు నీరు, తీసుకోవాలి. ముందుగా ముందురోజు రాత్రి బెంతులను ఒక కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు మిశ్రమాన్ని వడకట్టి విత్తనాలను పక్కన పెట్టుకోవాలి. దాని కొంచెం నిమ్మకాయ నీరు కలుపుకుని కావాలనుకుంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి