Varsha Bollamma’s First Look as Sreya Rao In Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul, Latest Telugu Movies,
FILM NEWS: రాజ్ తరుణ్ హీరోగా “స్టాండప్ రాహుల్” లో శ్రేయారావుగా వర్షబొల్లమ్మ ఫస్ట్ లుక్ విడుదల.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్.
ఇది జీవితంలో దేనికోసం కచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం మరియు అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నతన అభిరుచిని చాటుకునే స్టాండ్-అప్ కామిక్ కథ.
ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆమె ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వర్ష కూడా శ్రేయా రావు అనే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తుంది. డిఫరెంట్ ఇమేజెస్‌తో ఉన్న వర్షబొల్లమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి నిర్వహిస్తున్నారు.
వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నటీనటులు:
రాజ్ తరుణ్, వర్షబొల్లమ్మ, వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు:
రచన- దర్శకత్వం – సాంటో మోహన్ వీరంకి
నిర్మాణ సంస్థలు – డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్
సమర్పణ – సిద్ధు ముద్ద
నిర్మాతలు – నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
సంగీతం – స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫి – శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటర్ – రవితేజ గిరిజెల్ల
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
ఆర్ట్ – ఉదయ్
పిఆర్ఓ- వంశీ- శేఖర్.