మైఖేల్ చిత్రం గురించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించి నిర్మాణ సంస్థ ప్రకటించినప్పటి నుంచీ చిత్రంపై మరింత క్రేజ్ ఏర్పడింది. వారంతా ఈ సినిమాలో పనిచేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. హ్యాండ్సమ్, టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే పాత్రను పోషిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్రతిభగల నటీమణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.
ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీకరించిన మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది. తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు.