బెడ్‌రూంల పడుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. చక్కటి నిద్ర సగం రోగాలను కంట్రోల్ చేస్తుంది. నిద్రపోయే విధానం కూడా ఇందుకే మేలు చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే దీనికి కొన్ని నియమాలు పాటిస్తే బావుటుంది.
పడమర వైపు తలపెట్టి పడుకున్నప్పుడు కలత నిద్ర వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోవడంతో మధ్యలో ఎక్కువగా లేవాల్సి ఉంటుందట. తరచూ నిద్రలేమితో బాధపడటం వల్ల హెల్త్‌పై ప్రభావం పడుతుందని ఆరోగ్యశాస్త్రం చెబుతోంది.
తూర్పువైపున తల పెట్టి పడమర వైపు అభిముఖంగా నిద్రపోతే సుఖనిద్ర పడుతుందట. ఉత్తరం వైపు తలపెట్టి దక్షిణానికి అభిముఖంగా పడుకోవడం అంత అనుకూలం కాదని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు. శాస్త్రపరంగా దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలు మనలో ఉన్న శక్తిని గ్రహించి మనిషిని నిర్వీర్యం చేస్తాయట. అందుకే పురాణాలలో ఉత్తరం వైపు నిద్రించే ఏనుగు తలను వేరు చేయడం లాంటి కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.