బాలకృష్ణతో ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆయన కథలోని అక్షరం అక్షరం పూనేస్తాడు.. చిరంజీవి దగ్గరుండి ప్రతి అక్షరం దిద్దిస్తే.. బాలయ్య ఏ మాత్రం స్టోరీని టచ్ చేయకుండానే ప్రభావం చూపిస్తాడు.. అయినా సరే వీరసింహారెడ్డి చిత్రం
ముమ్మాటికీ సంక్రాంతి హిట్ కిందకే వస్తుంది.. ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు ఏం ఆశిస్తారో సరిగ్గా అలాంటి ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తోంది.. నిజం చెబితే.. రాజకీయంగా టీడీపీ దాని సానుకూలపరులకు ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైసీపీని దాని అఖండ విజయ పరంపరను తునాతునకలు చేయడానికి.. ఒక అతీతమైన శక్తి కావాలి ఆ అతీత శక్తిని బాలయ్య వీరసింహారెడ్డి రూపంలో నేరుగా ఆయన ఫ్యాన్స్ లోకి ఇంజెక్ట్ చేశాడా అనిపిస్తోంది..
లేకుంటే ….. యూఎస్ థియేటర్ మేనేజర్ గతంలో తామెన్నడూ ఇలాంటి మాస్ రచ్చ చూడలేదనడమేంటి?
ఒక ముసలి పూజారి సైతం పూనకాలొచ్చినట్టు ఊగిపోవడమేంటి ? వీటన్నిటిని బట్టీ చూస్తుంటే.. వీరసింహారెడ్డి థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తోందనిపిస్తోంది.. సుమారు 80 కోట్ల రూపాయల బిజినెస్ తో
వరల్డ్ వైడ్ థియేటరైజ్ అయిన వీరసింహారెడ్డి.. కేవలం ఫ్యాన్స్ పండగ చేస్కోవడం కోసం రిలీజైన బాలయ్యలోని నటసింహానికి సంబంధించిన జస్ట్ ట్రైలర్ మాత్రమే.. బాలకృష్ణ నుంచి ఈ మాత్రం ఊపు చాలు.. మిగిలినదంతా ఫ్యాన్స్ చూసుకుంటారు..
ఇక్కడ బోయపాటికీ, బీగోపాల్ కి మిగిలిన దర్శకులకు తేడా ఏంటంటే.. ఎంతలేసి మాస్ ఎలిమెంట్స్ ఉన్నా.. కథను కేవలం బాలయ్య మేనియాతో పులిమేయకుండా తాము స్పృహలో ఉండి కథను రూపొందిస్తారు.. క్రిటిక్స్ నుంచి ఇదే విమర్శ వినిపిస్తోంది.. మలినేని గోపిచంద్ అండ్ కో.. ఈ విషయంలో ఎక్కడో బోల్తా కొట్టారు.. అంతా బాలయ్య చూసుకుంటాడులే.. అన్న కోణంలో కథను వెనకా ముందు చూసుకోకుండా కలిపేశారు.. ఈ విషయంలో దర్శక రచయితలు.. కాస్త మెలుకువగా ఉండాల్సింది.. ఇక్కడే ఇది సాధారణ సినిమా స్థాయిని చేజారి.. ఒన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబు సినిమాగా మిగిలిపోయిందన్న మాట వినిపిస్తోంది.