Vijay Antony Bichagadu 2:బిచ్చగాడు సినిమా తో ఓ రేంజ్ విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2 తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి సక్సెస్ ఫుల్ గా వచ్చాడు . ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 థియేటర్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమాని బిచ్చగాళ్లకు చూపించి వారితో సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు .
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని అందుకోవడమే కాకుండా ఏకంగా తెలుగులో 100 రోజులు ఆడి డబ్బింగ్ సినిమాల్లో రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా అదే రేంజ్ సక్సెస్ ని అందుకుంటుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఇక ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే విజయ్ ఆంటోనీ.. సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం తిరుపతిలో ఉన్న విజయ్ ఆంటోనీ.. కపిలతీర్థం రోడ్డులో బిచ్చగాళ్లతో కాసేపు ముచ్చటించాడు. అనంతరం వారందిరికి కిట్లు పంపిణీ చేశాడు. అలాగే వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశాడు. తెలుగు రాష్ట్రంలో విజయ్ ఆంటోనీ సందడి చేస్తుంటే తమిళంలో అతని భార్య ఫాతిమా.. బిక్షగాళ్ళుకు ప్రత్యేకంగా బిచ్చగాడు 2 షో వేయించింది. చెన్నైలోని ఓ సినిమా హాల్లో 150 మందిపైగా బిక్షగాళ్ళుకు సినిమాని చూపించిన ఫాతిమా.. అనంతరం వారందరికీ దుస్తులు పంపిణీ చేసింది
కాగా బిచ్చగాడు 2 చిత్రానికి కూడా ఆడియన్స్ నుంచి ఇంతటి రెస్పాన్స్ వస్తుండడం చూసిన విజయ ఆంటోనీ.. ప్రేక్షకులకు అందరికి థాంక్యూ చెప్పాడు. బిచ్చగాడు ఫ్రాంచైజ్ లో మూడో సినిమాని కూడా తీసుకు వస్తాను అంటూ ప్రకటించాడు. ఆల్రెడీ బిచ్చగాడు 3 కథని కూడా రాస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 2025 లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీకి 23 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.