విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో శరణ్ కుమార్ మాట్లాడుతూ.. `మిస్టర్ కింగ్` నుండి విడుదలైన నేనెరుగని దారేదో పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తున్నాం. లాక్ డౌన్ ఛాలెంజింగ్ సమయంలో ఒక సవాల్ తీసుకొని ఈ సినిమాని చేశాం. శశిధర్ చాలా అద్భుతమైన కథ చేశారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాని తెరకెక్కించారు. మణిశర్మ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. మీ అందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.