Crime రెండు గ్యాంగుల మధ్య జరిగిన సంఘటన చివరికి తీవ్ర దుమారం రేపింది వారిద్దరి మధ్య గొడవ చల్లారకపోగా పంచాయతీ కోసం వెళ్లిన పోలీసులపై దాడికి దిగారు ఆ గ్రామస్తులు ఈ షాకింగ్ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో లద్దపుట్టిలో రెండు రోజుల క్రితం రెండు గ్యాంగులకు చెందిన యువకుల మధ్య కొట్లాట జరిగింది అయితే ఇది పెద్ద దుమారం రావడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది అయితే ఈ ఎంక్వైరీ లో భాగంగా విచారణకు సోమవారం ఎస్సై రామకృష్ణ తో పాటు పోలీసు సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లారు.. ఈ విషయంపై అక్కడ పెద్ద చచ్చే నడిచింది అసలు గొడవేంటి అని పోలీసులు అడగగా అందుకు ఎవరు సరైన సమాధానం ఇవ్వలేదు. మరి పోలీస్ కేసు ఎందుకు పెట్టారని గ్రామస్తుల్ని అడిగిన పోలీసులకు సమాధానం ఇవ్వకుండా తిరిగి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు దాంతో పోలీసులు మీరందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని ఆదేశాలు ఇవ్వగా.. పోలీసులు గ్రామస్తులు మధ్య తీవ్ర భాగ్వాదం చెలరేగింది అయితే ఈ విషయంపై విచారణ జరపగా పోలీసులు తమను తిట్టారంటూ గ్రామస్తులు చెప్పగా గ్రామస్తులు సరైన సమాధానం ఇవ్వకపోగా తిరిగి తమపై దాడికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.. అయితే విషయం ఏమైనాప్పటికీ డ్యూటీలో ఉన్న పోలీసులపై గ్రామస్తులు దాడి చేయడం అనేది పెద్ద నేరం గాని చెప్పవచ్చు.. అయితే ఈ విషయం ఇంతటితో చల్లారలేదు దీనిపై ఇంకా పూర్తి విచారణ జరగాల్సి ఉంది నిజ నిజాలు బయటకు వస్తే నిందితులకు తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంది..