సూపర్‌స్టార్ మహేశ్‌బాబు జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూస్తోన్న సూపర్‌స్టార్ అభిమానులు ఈ రేంజ్‌లో వర్కౌట్ చేస్తున్నాడంటే నెక్ట్స్ సినిమాలో మా అన్న సిక్స్ ప్యాక్‌లో కనిపించడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహేశ్ బాబు ట్రైనర్ ఆధ్వర్యంలో డంబెల్‌తో కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన అభిమానులు.. అన్నా అన్ ఫైర్, నెక్ట్స్ సినిమాలో అన్న సిక్స్ ప్యాక్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మహేశ్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. మహేశ్ బాబు సరసన పూజాహెగ్డే నటిస్తోంది.