Virata Parvam Movie Late Review by Senior Journalist Audi
కన్నీళ్లతో కళ్లు కమ్ముకున్న వేళ… వెన్నల నా హృది నిండా ఎర్రటి పిండారబోసినట్టు కమ్ముకున్న వేళ.. నమ్మకాలు ఒమ్ములై ప్రేమలన్నీ పటాపంచలైన శబ్ధాలు పెళపెళ విరుచుకుపడుతున్న వేళ.. చెప్పుడు మాటలు ఆ సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టిన ఘటనలు తిరిగి వర్తమానంలోకి వచ్చిన వేళ.. ప్రేమంత పూసిన గుండెలకు సాటి ప్రేమించిన గుండె కూడా హత్తుకుంటే చూడాలని భావించిన వేళ.. ఆ ఆశలన్నీ అడియాశలై.. అతడి కరడుగట్టిన తుపాకీ గొట్టం లోంచి తూట్లు పొడవడానికి వచ్చిన ఆ ఒక్క తూటా..
హ…….. పోతున్న ప్రాణాన్ని ఆపలేనితనన్నా వెక్కిరిస్తూ…… ఏ జోహార్లు పోతున్న ఆ ప్రాణానికి సాటి రాగలవు.. ఏ విప్లవాలు ఆ ప్రేమ గీతానికి అర్ధం చెప్పగలవు.. ఏ కోవర్టు ఆపరేషన్లు ఆ రహస్యాన్ని డీకోడ్ చేయగలవు.. అంతా నీరవ నిశ్శబ్ధం.. అంతా స్మశాన వైరాగ్య విధ్వంసం..
రాత పుట్టించిన ప్రేమలవి… తలరాతలను మార్చేస్తాయని ఆశపడ్డ ఓ ఆడపిల్ల అంతరంగాన్ని ఒడిసి పట్టలేక పోయాయంటే..
ఆ ఉద్యమం ఎందుకు?
ఆ కామ్రెడ్లు ఎందుకు??
ఆ దళాలు ఎందుకు???
ఆ కమాండర్లు ఎందుకు………. అనిపిస్తుంది…
నాలాంటి బిడ్డయితే పగవాడికి కూడా వద్దు నాన్నా.. అంటూ ఆ పిల్ల చెప్పిన మాటలు గుండెల్ని మెలిపెట్టేస్తాయ్.. ఉద్యమంలో ప్రేమ ఉద్యమాన్ని నిలుపులోలేక నిజం నిరూపించలేక ఆ ప్రాణం పోతుంటే.. ఇటు చూస్తున్న ప్రేక్షకుడి గుండెలు విలవిలలాడటం.. ఈ మధ్యకాలంలో ఇదే చూడ్డం.. ఆ ఆత్మఘోష అంత మాములుది కాదు.. ఆమె కళ్లు నచ్చితే ఆమె ఒళ్లంతా నచ్చి తీరాలన్నట్టు.. తనలోని ఏదో ఒక చైతన్యాన్ని రగిల్చిన అతడి రాతల్ని బాగా ఇష్టపడ్డం వల్ల ఆమె అతడి తూటాలకు తూటాల మధ్య సాగే జీవితం మొత్తాన్ని ప్రేమించాల్సి వచ్చింది.. అతడి కన్న తల్లిని వెతుక్కుంటూ వెళ్లి.. ఆమె సందేశాన్ని కూడా అతడికిచ్చి అతడ్ని తల్లిని కలిపిన సన్నివేశం గానీ. ఆ ముతక ఇళ్ల మధ్యమెరిసన ఆ ప్రేమైక వజ్రాన్ని కానీ చిత్రణ పట్టిన ఆ దర్శకుడికి నిజంగా హృదయాభివందనం.
పెట్టుడు కథల కట్టుడు కథనాల సమాహారాలను చూసి చూసి విసిగి వేసారిని ప్రేక్షక హృదయాలను హత్తుకునేలా చిత్రించిన ఈ ప్రేమ పోరాట పర్వం తీయాలనిపించిన దర్శకుడికి నిజంగా నిజంగా నిజంగా ప్రేమాభివందనం.. ఇంకా అడవిలో పారే జలజలజలపాతంలా..
గాలికి రెపరెపలాడే చిటారుకొమ్మన ఊగే.. చివురుటాకులా మబ్బులు మసాజ్ చేస్తుంటే.. అంతులేని ఆనందాలను పొందే కొండంచులా.. అనుభూతులను పంచిన ఈ సినిమా వండ్రఫుల్.. భేష్… శభాష్…
కొన్ని అక్షరాల్లో కుందించి చెప్పలేని.. ప్రేమాధ్యాత్మికానుభూతి.. ఒక భక్తిరస ప్రధాన చిత్రం చూస్తే ఎలాంటి భక్తి భావం పొంగిపొర్లుతుందో
ఈ విప్లవాత్మక ప్రేమ కథా చిత్రాన్ని చూసి.. ఆ చిత్రణ పట్టిన దర్శకుడికి ఈ దృశ్యాన్ని కావ్యం చేసిన కెమెరా పని తనానికీ వేన వేల దండాలను సమర్పించకుండా ఉండలేక పోతున్నా.. ఒక సినిమా చూస్తే అందులోని ప్రభావం ఒక మత్తుగా మారి.. నా ఒళ్లంతా కమ్మేసిన అనుభూతితో ఇది రాస్తున్నా.. ఇది నేను రాస్తున్న రాత కాదు ? నాచేత ఆ చిత్రమే రాయిస్తున్న అభిమాన చేవ్రాలు.. థాంక్యూ వేణు
ఇంత మంచి చిత్రం కళ్ల నుంచి నేరుగా మనసులోని మళ్లించినందుకు … హేట్సాఫ్ టూ యూ.. అండ్ యువర్ టీం.. ఇట్స్ మార్వలెస్.. రియల్లీ ఇట్స్ గ్రేట్ జాబ్… థాంక్యూ థాంక్యూ వెరి మచ్ !!!Virata Parvam Movie Late Review by Senior Journalist Audi