Health News:మానవ శరీరంలో విటమిన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు అధికమవుతాయని చెప్పుకోవాలి. అయితే విటమిన్ డి శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ , మెగ్నీషియం వంటి ఖనిజాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా విటమిన్ డి పూర్తిస్థాయిలో ఉదయాన్నే సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు.విటమిన్ డి లోపించడం వల్ల ఎన్ని సమస్యలు ఏర్పడతాయి అనే విషయాన్ని తెలుసుకోండి మరి.
విటమిన్ డి లోపించడం వల్లన అలసట కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తలనొప్పి బలహీనత వాటి సమస్యలు అధికమవుతాయి. చిన్న పిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కావల్సినంత విటమిన్ డీ లేకపోతే ఆడవారిలో బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉండవచ్చును.విటమిన్ డి తక్కువగా ఉన్నవారు ఈ క్రింది సూచించిన ఆహారం తీసుకోవడం వల్లన విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం ఆహారంపై అవగాహన మాత్రమే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులు సూచించాలని తెలియపరచడం జరుగుతుంది.
విటమిన్ డి లోపించినవారు ట్యూన్న ఫిష్ లాంటి చేపలను తీసుకోవడం మంచిది వీటిలో విటమిన్ డీ అధికంగా ఉంటుంది. విటమిన్ డీ పుష్కలంగా ఉండేవాటిలో మష్రూమ్స్ ఒకటి. మష్రూమ్స్‌లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ డీ కూడా .పుష్కలంగా లభిస్తుంది.గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డీ అధికంగా ఉంటాయి.మరి ముఖ్యంగా ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి లో ఒక 30 నిమిషాల పాటు ఉంటే విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు.