క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో పేరుగాంచారు దర్శకుడు కె దశరధ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంతోషం’ సినిమా తెలుగులో అత్యుత్తమ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. దశరధ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌కు ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్ తో కథని రాశారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రోహిత్ బెహల్ హీరోగా నటిస్తుండగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ లుక్, సినిమా థీమ్‌ను తెలిపే వీడియోను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయగా, థీమ్ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రోహిత్, అపర్ణల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో అపర్ణ చాలా అందంగా కనిపించగా, రోహిత్ హ్యాండ్సామ్ గా కనిపించాడు. థీమ్ మ్యూజిక్, విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా వున్నాయి.
అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ.. దశరధ్ మంచి స్నేహితుడు. ఇష్టమైన వ్యక్తి. తన కథ రాసి చౌదరిగారితో కలసి తొలిసారిగా ప్రొడక్షన్ లోకి వచ్చారు. మన స్టూడియో పెట్టి డివై చౌదరి గారు గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. హీరో, హీరోయిన్లు చక్కగా ఫెర్ ఫార్మ్ చేశారు. బెనర్జీ గారి పాత్ర కొత్తగా వుంటుంది. అందరూ చక్కగా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.
కె దశరధ్ మాట్లాడుతూ.. నేను చేసిన ప్రతి కథ ఓ ముగ్గురికి చెబుతాను. అందులో వినాయక్ గారు ఒకరు. ఆయన ఇచ్చిన అద్భుతమైన సూచునలతో ఈ కథ చేశాం. ఆయనకి కృతజ్ఞతలు. అలాగే గోపి మోహన్ హరికృష్ణ గారు నాపై వున్న ప్రేమతో అన్ని రకాలుగా సహాయం చేశారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. డివై చౌదరి నాకు చిన్నప్పటి ఫ్రండ్. మా ఇద్దరిదీ ఒకటే ఊరు. ఇండస్ట్రీకి వచ్చాక కూడా పాతికేళ్ళుగా ఫ్రండ్ గా ఉంటున్నాం. తనతో కలసి ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం చాలా మంది ప్రతిభగ యువకులు పని చేశారు. స్క్రీన్ ప్లే కిషోర్ గోపు, శివ అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాస్తున్నారు. ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కె వేద మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా మంచి టీం వర్క్ చేశాం” అన్నారు.