Health బరువు ఎక్కువగా ఉన్నామని బాధపడుతున్న వాళ్లు ఏవేవో చేస్తూ ఉంటారు.. అయితే ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం లేకపోతే వచ్చే లాభం ఏమి ఉండదు. అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే వీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందామా.. ఓట్స్‌లో బీటా గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ అనేవి బరువు పెరగడానికి, తగ్గటానికి కూడా ఉపయోగపడే అద్భుత ఆహారం. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయపడతాయి. ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా ఓట్స్ డ్రింకింగ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది..
అలాగే ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక కొవ్వు అనేది కరిగిపోతుంది.. నిమ్మకాయలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడతాయి.. సోంపును నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకున్న మంచి ప్రయోజనాలు ఉంటాయి. సోంపులో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం ఉంటుంది.. రోజూ గ్రీన్ టీ తీసుకున్న పొట్ట దగ్గర పేర్కొన్న కొవ్వును, శరీరంలో ఉన్న కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మంచి మంచి నిగారింపును ఇస్తాయి.. వీటన్నిటితో పాటు రోజూ తప్పకుండా ఆరు నుంచి పది గ్లాసుల నీరు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. బయట దొరికే కూల్‌డ్రింక్స్ లో అధిక స్థాయిలో చక్కెర ఉండటం వల్ల.. అవి బరువును పెంచుతాయి. అందుకే ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వీటికి దూరంగా ఉండాలి.