Health ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య ఉబకాయం అధిక బరువుతో బాధపడుతూ ఎంతోమంది ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అయితే రోజు జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు పైన దృష్టి పెడితే బరువు తగ్గటం అంత పెద్ద విషయం ఏం కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
చాలామంది బరువు తగ్గాలి అనుకుంటారు ఇందుకోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు వర్కౌట్ చేయడం జిమ్‌లో జాయిన్ అవ్వటం రన్నింగ్ జాకింగ్ వంటి ఎన్నో విధానాలు ఎంచుకుంటారు అయినప్పటికీ వీటన్ని కచ్చితంగా ఫాలో అవ్వలేక మానేస్తుంటారు అయితే రోజు మన జీవితంలో చేసే ఎన్నో పనులు పైన కొంచెం ఏకాగ్రత పెడితే శరీరంలో క్యాలరీలను ఇట్టే కరిగించేసుకోవచ్చు అని తెలుస్తుంది అది ఏంటంటే.. బయటకు అలా షాపింగ్ చేయడానికి వెళుతూ ఉంటాం. ఎక్కువ దూరం కాకుండా కొంచెం దూరం అయితే వీలైనంత దూరం నడవడానికి ప్రయత్నించాలి అలాగే షాపింగ్ మాల్స్‌లో ఎస్కులేటర్ కి బదులు మెట్లు ఎక్కువ వెళ్లడం వంటివి చేయాలి.. అలాగే చాలామంది గంటలు తరబడి కూర్చొని పనిచేస్తూ ఉంటారు అలా కాకుండా మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవడం చేయాలి అంతేకాకుండా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడాలి వస్తే కూర్చొని మాట్లాడే కన్నా అటు ఇటు తిరుగుతూ మాట్లాడటం వల్ల శరీరంలో ఒక క్యాలరీలు ఖర్చు అవుతాయి..
అలాగే స్నానం చేసినప్పుడు దాన్ని కాసేపు పక్కన పెట్టి బకెట్లో నీళ్లు ఉంచుకొని స్నానం చేయటం ఉత్తమం దీనివలన నీరు కోసం ప్రతిసారి వంగటం వల్ల శరీరానికి కావలసినంత ఎక్ససైజ్ అందుతుంది.. అలాగే నలుగురిలో కూర్చున్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోవాలి ఇలా చేయడం వల్ల మానసిక ఆందోళన దూరం అవుతుంది..