1. తర్పణం అంటే ఏమిటి ? : తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.
2. తర్పణము ఎన్నిరకాలు ? : తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు.
సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయ బడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.
ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు :- గరుడ తర్పణం : – ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు. బ్రహ్మ యజ్ఞ తర్పణం : – నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి. పర్హెణి తర్పణం : – యేటా చేసే పితృకర్మల తరువాతి రోజు ఇచ్చే తర్పణాలు. సాధారణ తర్పణం : – అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.
3. తర్పణాలు ఎందుకు వదులుతాము ? : తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకొనబడుటకు, వారిని ప్రీతి చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.
4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ? : 1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి. 2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు. 3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు. 4. ఆవు నేతితో తర్పణము చేస్తే, సుఖము. 5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, సర్వ సిద్ధి. 6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే శత్రు నాశనము.
5. తర్పణం ఎలా వదలాలి ? : కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించ వలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది) * బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 9642298899