Health Tips:- డయాబెటీస్ ఉన్న వారికి ఏ రైస్ మంచివి ?
మనలో రెగ్యులర్ గా వైట్ రైస్ నే ముఖ్య ఆహార పదార్థంగా తీసుకుంటాము, కానీ బ్రౌన్ రైస్ ని చాలా తక్కువ మంది తీసుకుంటారు, బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. బ్రౌన్ రైస్ లో 2 రకాలు ఉన్నాయి ,1 నార్మల్ బ్రౌన్ రైస్ , 2 బాస్మతి బ్రౌన్ రైస్ , ఐతే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వారికి ఏవి మంచివి అనే విషయాన్నీ తెలుసుకుందాం ?
మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలు ఎంత త్వరగా గ్లూకోజుగా మారి రక్తంలో చేరతాయి అనే దానికి కొలమానం గ్లైసెమిక్ ఇండెక్స్. ఇది ఎక్కువగా ఉండే పదార్థాల నుండి గ్లూకోజు త్వరగా రక్తంలో చేరుతుంది. తెల్లబియ్యం, బ్రౌన్ రైస్‌తో పోలిస్తే, బాస్మతి బ్రౌన్ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో తీసుకుంటే ఎటువంటి బియ్యం అయినా రక్తంలో చక్కర శాతం పెరుగుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, ప్రొటీన్ అధికంగా ఉండే పప్పుధాన్యాలను ఎక్కువ మోతాదులో పిండిపదార్థాలు బాగా ఉండే బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను మితంగా తీసుకుంటే డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.