Health నిత్యం యవ్వనంగా మెరిసిపోవాలని ఎవరికీ ఉండదు కానీ మారిపోతున్న జీవనశైలి కాలుష్య కారణాలతో ఎన్నో చర్మ సంబంధిత సమస్యలతో పాటు తొందరగా వయసు పై పడినట్టు కనిపిస్తున్నారు ఈ కాలం యువతులు.. అయితే ఇందుకు చక్కని పరిష్కారం ఏంటంటే..
చిన్న వయసులోనే మొహం పై ముడతలు వచ్చిన చర్మం సాగినట్టు అనిపించినా అది ఎంతో కుంగుబాటుకు దారితీస్తుంది.. ముఖ్యంగా మొహం పై వచ్చే మొటిమలు కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా దగ్గర చేసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా సి విటమిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మా నారింజ బత్తాయి పళ్ళను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నిగారింపును సంతరించుకుంటుందని తెలుస్తోంది వీటిలో ఉండే విటమిన్ సి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతోపాటు చర్మం మెరిసేటట్టు చేస్తుంది.. అలాగే అందాన్ని కాపాడడంలో బొప్పాయి కూడా మరొక ప్రముఖ పాత్ర పోషిస్తుంది బొప్పాయిని ఏ విధంగా తీసుకున్న శరీరానికి మంచిదే ఇది చర్మానికి కావాల్సిన నిగారింపును అందిస్తుంది తిన్న దీన్ని జ్యూస్ తాగిన మంచి ఫలితాలు ఉంటాయి అలాగే బొప్పాయిని మెత్తగా గుజ్జులా చేసి మొహానికి పట్టించడం వల్ల మొహం పై ఉండే ముడతలు మాయమవుతాయని తెలుస్తోంది… అలాగే అలోవెరానో తరచూ మొహానికి అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది అలాగే విటమిన్ అధికంగా ఉండే బాదం నూనె శరీరానికి జుట్టుకు కూడా చాలా మంచిది..