Health కామెర్లు ఈరోజుల్లో చాలామందికి సాధారణంగా వస్తున్నాయి.. అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం అయితే మాత్రం కాదు.. ముఖ్యంగా కామెర్లు వచ్చిన వాళ్ళు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి.. ఎందుకు అంటే ఇది నేరుగా కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు.. అందుకే కామెర్లు ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు అనేది పూర్తిగా తెలుసుకోండి..
వీళ్లకు మొదట్లో లివర్ ఫంక్షన్ తక్కువగా ఉండటం వల్ల ఘనపదార్ధాలు అడిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది.. అందుకే కామెర్లు వచ్చినవాళ్లు లిక్విడ్ డైట్ ని ఎక్కువగా తీసుకోవాలి. అన్ని రకాల పండ్ల జ్యూస్ లు, బార్లీ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. తొందరగా అరిగించుకునే మెత్తని ఆహారాన్ని తీసుకోవాలి..
కామెర్లు తగ్గే స్టేజ్ లో ఉన్నప్పుడు బాగా ఆకలేస్తుంది నిజానికి ఆకలి వేస్తుంది అంటే కామెర్లు తగ్గుతున్నాయి అని అనుకోవచ్చు అందుకే ఈ సమయంలో వాళ్ళకి ఎక్కువసార్లు కొంచెం కొంచెంగా ఫుడ్ అందించాలి. అయితే ఒక 15 నుంచి 20 రోజులు తర్వాత నెమ్మదిగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ ను ఇవ్వాలి. కొన్ని రోజుల వరకు మాంసాహారాన్ని దూరంగా ఉంచడం మంచిది. అలాగే సాల్ట్ కంటెంట్ కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అన్ని రకాల పళ్ళు, కాయగూరలు తీసుకోవచ్చు.. అయితే ఒక మూడు నెలల వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ దూరంగా ఉంచాలి.. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి..