Crime కొందరు మగవాళ్ళు పరాయి ఆడవాళ్ళ వ్యామోహం లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఇలాంటి బాధను తట్టుకోలేక ఆడవాళ్లు సైతం అఘాయిత్యాలకు పాల్పడతారు అయితే ఇలా పరాయి ఆడవాళ్ళ వ్యామోహం లో పడిన భర్తను దారికి తేలేక కోపంలో భార్య చేసిన ఓ పని అందరిని భయభ్రాంతులకు గురి చేసింది..
పరాయి శ్రీ వ్యామోహం లో పడి తనను పట్టించుకోవడం మానేసిన భర్తపై పగపించుకున్న భార్య దారుణానికి వడగట్టింది చాలా కాలం పాటు వేచి చూసి ఇంకా ఎన్ని సార్లు చెప్పినా అతను మారడం లేదని ఓ నిర్ణయానికి వచ్చేసింది.. భర్తపై వేడి వేడి నూనె పోసిందో ఇల్లాలు. ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ.. మూడు రోజుల కిందటే తన వద్దకు వచ్చాడని.. భార్యాపిల్లలను మరిచి బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాడనే ఈ పని చేసినట్ల భార్య చెప్పింది.
వివరాల్లోకెళితే.. కుల్సుంపురా ఠాణా పోలీసులు పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.. విజయవాడ సింగినగర్‌కు చెందిన గిరిధర్‌లాల్ (50), రేణుక (40)కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు… విజయవాడలో మాంసం దుకాణం నిర్వహించే గిరిధర్‌లాల్ పిల్లల చదువు నిమిత్తం మూడున్నరేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాడు.
గిరిధర్‌లాల్ ఆడవాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఇంట్లో ఉండే తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని భార్య ఆరోపించింది. ఇదే విషయమై వీరిద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగినప్పటికీ అతని పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదనీ.. ఈ క్రమంలోనే ఐదు నెలలుగా ఓ మహిళ వద్దే ఉంటూ, మూడ్రోజుల కిందటే తన వద్దకు వచ్చాడని ఆమె చెబుతోంది. దాంతో మూడ్రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం పనికి వెళ్లొచ్చి గిరిధర్ ఇంట్లో నిద్రపోతుండగా.. రేణుక పొయ్యి మీద నూనె బాగా మరిగించి భర్త తలపై పోసింది.