Health ఇంట్లోనే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చలి నుంచి తేలికగా బయటపడవచ్చు అని తెలుస్తుంది.. చలికాలం వచ్చేసింది.. ఇంకొన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు స్వెటర్లో మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే చలికాలం అంటేనే ఉదయం నిద్ర లేవటానికి బద్దకంగా అనిపిస్తుంది కానీ ఈ బద్ధకాన్ని పక్కన పెట్టి సూర్యోదయం సమయంలో నిద్ర లేచి కాసేపు ఎండలో తిరిగితే రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.
అలాగే ప్రతిసారి వచ్చే చలి కాలం కోసం ప్రత్యేకంగా దుప్పట్లు ఏం కొంటామని అనుకోకుండా ఈ కాలానికి సరిపోయినట్టు చలిని తట్టుకొనే మంచి దుప్పట్లను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గదిలో కొత్తదనం కనిపించడమే కాకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.. పడుకునే కాసేపు అయినా చక్కని నిద్ర అందుతుంది..అలాగే ఏ కాఫీ ఓ టీ ఓ తాగాలి అనిపించినప్పుడు ఎక్కువ సమయం వేచి ఉంచకుండా వెంటనే తీసుకోవడం వల్ల నిద్ర మత్తు వదిలి చలి ఫీలింగ్ నుంచి తేలికగా బయటపడవచ్చు.. అలాగే ఇందుకు వార్మర్ ప్లేట్లను ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది.. అలాగే రాత్రి పడుకునే ముందు కాళ్లకు గోరు వెచ్చని నూనె రాసుకుని సాక్సులు తోడుక్కొని పడుకోవడం వల్ల వెచ్చగా అనిపిస్తుంది.. అలాగే చలి మరీ ఎక్కువగా అనిపిస్తే రూమ్ హీటర్లను ప్రయత్నించవచ్చు.. అలాగే కొత్తగా వస్తున్న మంకీ క్యాప్స్ చలిని తట్టుకోవడంలో మంచిగా సహాయ పడుతున్నాయి.. వీటిని తలకు పెట్టుకోవడం వల్ల చలి సమస్యలను దూరం చేసుకోవచ్చు..