Crime అల్లరి ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా బాగా సంపాదిస్తాడు మంచిగా చూసుకుంటాడు అని నమ్మి పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఏం చేయాలో తోచక ఇంటిలోనే ఉరేసుకొని చనిపోయింది ఓ యువతి.. వివరాల్లోకి వెళితే..
ఉరవకొండ సీవివి నగర్‌కు చెందిన వినోద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు ఇతనికి బుక్కరాయసముద్రానికి చెందిన శిరీషతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ పెళ్లి సమయంలోనే శిరీష తల్లిదండ్రులు 20 తులాల వరకు బంగారం లక్ష నగదు తో పాటు ఐదు సెంట్లు స్థలాన్ని కూడా అల్లుడికి ఇచ్చారు అయితే ఇది ఏమాత్రం చాలలేదంటూ పెళ్లయిన తర్వాత ఆమెను అదనపు కట్నం కోసం వేధించారు భర్తతోపాటు అత్త.. ఆడపడుచు తో పాటు ఆమె భర్త వినోద్ మేనమామ కూడా ఈమెను కట్నం కోసం వేధించటం మొదలుపెట్టారు.. అయితే ఈ వేధింపులు తట్టుకోలేక ఇంటిలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది తెల్లవారి ఇంట్లో వాళ్ళందరూ లేచి చూసేటప్పటికి ఫ్యాన్ కు వేలాడుతున్న శిరీషను తీసుకొని ఆస్పత్రికి వెళ్ళినప్పటికీ ఆమె చనిపోయిందని అక్కడ వైద్యులు నిర్ధారించారు..
విషయం తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు కూతురు జీవితం బావుంటుందని ఇంత కట్నం ధారబోసి బంగారం లాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశామని చివరికి తన జీవితం ఇలా అయిపోయిందని ఏడాది వయసున్న ఆమె కుమారుడి పరిస్థితి ఏమిటో రోదించారు..