Health Tips:ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులతో ముసలివ్వలు తాతలు మాత్రమే బాధపడేవారు. కానీ ప్రస్తుత కాలం లో యువత కూడా మోకాళ్ల నొప్పుల సమస్యతో అధికంగా బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అధిక బరువు అలానే మన మనం తీసుకునే ఆహారం నాణ్యత లేకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా చెప్పుకోవచ్చు. అయితే చాలామంది ఒక సందేహం మెదులుతుంది మోకాళ్ళ నొప్పులు పురుషుల కన్నా స్త్రీలకే అధికంగా వస్తాయని. దీని గురించి తెలుసుకొని మరి.
మన శరీరంలో హార్మోన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి.అయితే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మోకాళ్ళను ఆరోగ్యవంతంగా చేయడంలో కీలకపాత్రను పోషిస్తాయి. ఇది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల మోకాళ్ళకు మద్దతునిచ్చే ప్యాడెడ్ మృదులాస్థి తక్కువ అవడంతో మోకాలు నొప్పులు స్త్రీలకు అధికంగా వస్తాయి.
అలానే కొన్ని సర్వేల ప్రకారం పురుషులకంటే స్త్రీలే అధిక బరువు ఉంటారని రుజువడం జరిగింది. స్త్రీలలో ఉండే హార్మోన్స్ అధిక బరువును ప్రేరేపిస్తాయి. అందువల్ల మీ శరీరం బరువు అంతా మోకాళ్ళపై పడడం ద్వారా మోకాళ్ళ సమస్య అధికమవుతుంది. మోకాళ్ళ సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే 500 మీటర్లు నెమ్మదిగా వాక్ చేయడం మంచిది. అలానే పండ్లను అధికంగా తీసుకోవాలి. వీలైనంతవరకు వరకు యోగ చేస్తే మోకాళ్ళ సమస్య నుండి ఉపశమనం పొందుతారు.