Writer Kaloji Narayana Rao Jayanthi, Telangana Language Day , Writer Journalist Gogulapati Krishna Mohan, Telangana News, Telugu World Now,
ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా..తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలతో జోహారు జోహార్లు కాళోజి సారూ
ఆడ యీడ యంటె యవమాన పరిచిండ్రు
పుంటికూరయంటె పెదవి విరిసిండ్రు
ఆనపకాయంటె అలగజనమన్నారు
తెలగాణ బాషను తేలికగ జూసిండ్రు
నాభాషనుజూసి నలుగురు నవ్విండ్రు
నా యాసను జూసి నారాజు జేసిండ్రు
నా యాస బాసనే నక్షత్రమయ్యింది
నాబాషకూ ఒక్క పండుగేవచ్చింది
‘నీ భాషల్నే నీ బతుకుంది అన్నాడు
నీ యాసల్నే నీ సంస్కృతుందన్నాడు
బడి పలుకుల భాష మనకెందుకన్నాడు
పలుకు బడుల భాష ముద్దని చెప్పాడు
తెలుగు బాషయంటె తెలగాణ భాషరా
కాళోజీ పుణ్యమా కదిలింది ప్రభుత
తెలగాణ భాషకు దినమునే ప్రకటించె
కాళోజీ సారుకూ నివాళి యర్పించె
జోహారు జోహార్లు కాళోజి సారూ
అందుకోండి ఈ కవి నీరాజనాలు
🌺🙏🌺
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653