Bhakthi దేవాలయాల ప్రత్యేకత వేరు ముఖ్యంగా మన హిందూ సంప్రదాయంలో ప్రతి విషయానికి ఒక అర్థం ఉంటుంది మనం పాటించే ప్రతి ఆచారానికి మన పురాణాలు అర్థాలు చెబుతూనే ఉన్నాయి. అలాగే మన దేవాలయాల విశిష్టత కూడా ఏళ్ల కాలం నుంచి వివరించబడుతుంది.. అయితే ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.. కొన్ని దేవాలయాల పైన కాకుల అస్సలు వాలవట.. అయితే ఆ దేవాలయాలు ఏంటి దానికి అసలు కారణాలేంటి ఒకసారి చూద్దాం..
కొన్ని దేవాలయాల పైన అసలు కాకులు వాలంట ఇలాంటి దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి దేవాలయం కూడా అందులో ఒకటి.. పూర్వకాలంలో ఆగస్తుడు అనే ముని ఈ దేవాలయం ను దర్శించారంట.. ఈ సమయంలో అక్కడ ఆయన ఘోర తపస్సు చేస్తున్న సమయంలో కాకులు అయన తపస్సుకు భంగం కలిగించాయని.. దీంతో ఆయన ఇక్కడకు ఒక కాకి కూడా రాకూడదని శాపం విధించారు అంట.. నుంచి ఆ దేవాలయంలో ఒక కాకి కూడా కనిపించదని వినికిడి..
అయితే ఈ దేవాలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఈ దేవాలయంలో ఉండే నంది ప్రతి ఆట ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుందంట దీనిపై పరిశోధకులు ఎంతగా పరిశీలించిన ఆ మిస్టరీనిషేధించలేకపోతున్నారంట అయితే అలా నంది పెరగడానికి భక్తులు మాత్రం దేవుని మహిమ గానే భావిస్తారు.. అంతేకాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య కోసం ప్రస్తావించారు కలియుగంతంలో యాగంటి బసవయ్య లేచిన అంకె వేసే సమయంలో యుగాంతం జరుగుతుందని ఆయన చెప్పారు..