Crime News:కాలం మారుతున్న ఆధునిక యుగంలో అడుగుపెడుతున్న మనుషుల్లో మార్పు లేదనే చెప్పుకోవాలి. మతం కులం పిచ్చితో కుటుంబాలను స్నేహితులను దూరం చేసుకుంటున్నారు. మానవత్వానికి విలువ లేకుండా పోతుంది ప్రస్తుత సమాజంలో. విజ్ఞానవంతులైన సరే మార్పు అనేది ప్రస్తుత సమాజంలో లేదని చెప్పుకోవచ్చు. కులం పేరుతో ఎన్నో అరాచకాలు చేస్తూ కటకటాల పాలైన వారిని కూడా ఎందరిలో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అటువంటి దారుణమే ఉత్తరప్రదేశ్ లో లక్నో ప్రాంతంలో చోటు చేసుకుంది అదేంటో చదివే మరి.
లక్నోలో ఒక దళిత యువకుడికి ఘోర అవమానంజరిగింది. ఆ గ్రామ సర్పంచ్ అందరి ముందు దళిత యువకుడు పై చెప్పుతో దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. ఈ సంఘటనపై అక్కడే ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ యువకుడిపై దాడి చేసిన సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీనితో అక్కడి పోలీస్ బృందం ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
అక్కడి పోలీస్ దర్యాప్తులో దినేష్ కుమార్ (దళిత యువకుడు) పై..తాజ్‌పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్ మరియు రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్ గాజే సింగ్‌లు ఆ యువకుడు పై దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని దినేష్ కుమార్ బెదిరించడమే కాకుండా ఆ యువకుడిని కొడుతున్న వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. వీరిపై అక్కడి దళిత ప్రజలు భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్ విజయ్‌వర్గియా తెలియపరచడం జరిగింది. కొట్టిన వారిలో ఒకరిని పట్టుకున్నామని మరొక వ్యక్తి పరారీలో ఉన్నారని ఎస్పీ తెలియజేశారు.
Uttar Pradesh: 2 Booked for Beating Dalit Youth with Shoes in Muzaffarnagar, One Arrested After Video Went Viral #UttarPradesh #UP #Dalit #Muzaffarnagar @SurajKrBauddh https://t.co/dscG1Nr43Z
— LatestLY (@latestly) August 20, 2022