Crime ఆ యువకుడు చనిపోయాడని కుటుంబంలో అందరూ అనుకున్నారు ఇన్నాళ్లు వాళ్ళ మధ్య తిరుగుతూ ఉన్న ఆ మనిషి ఇక లేడని విషాదంలో ఉన్న వారికి ఒక్కసారిగా ఆ యువకుడు మళ్ళీ తిరిగి రావడంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది ఈ షాకింగ్ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది..
నెల్లూరు జిల్లాలో షాపింగ్ సంఘటన జరిగింది చనిపోయాడు ఇక రాడు అనుకున్న ఒక యువకుడు మళ్ళీ తిరిగి వచ్చాడు దీంతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా గంతులు వేశారు అసలు విషయం ఏమిటంటే
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి సర్పంచ్ పల్లేటి రమాదేవి కుమారుడు సతీష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.. గత కొన్నేళ్లుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సతీష్ కొన్నాళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు దీంతో అతను తల్లి తండ్రి అతనికి వైద్యం చేయిస్తున్నారు అయితే ఈ నెల 19వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ అబ్బాయి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అయితే దీంతో కంగారు పడిన తల్లి తండ్రి దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.. అయితే ఆ సమయంలోనే దగ్గర్లో ఉండే వెంకటాచలం గ్రామంలో ఓ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది ఈ విషయాన్ని సతీష్ తల్లిదండ్రులకు చెప్పిన పోలీసులు నీటిలో ఉంచాం మృతదేహాన్ని తీయగా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది అయితే అతని తల్లిదండ్రు తమ కుమారుడే అయ్యుంటాడు అని అనుకున్నారు ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించగా వారు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.. అయితే ఐదు రోజుల తర్వాత సతీష్ ఇంటికి చేరుకున్నాడు. సజీవంగా ఉన్న సతీష్ ను చూసి మొదట తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. తర్వాత అసలు విషయంతెలుసుకోవడం కోసం ఆరా తీశారు. మరణించాడు అనుకున్న కొడుకు సజీవంగా కనుల ముందుకు చేరుకునే సరికి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..