పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 12న థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.
గురువారం ఉప్పెన ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కార్యాలయంలో రిలీజ్ చేశారు. ట్రైలర్ సూపర్బ్‌గా ఉందంటూ ప్రశంసించారు. సినిమా కూడా అంతే బాగా ఉంటుందని ఆశిస్తున్నాననీ, తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాననీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ పాల్గొన్నారు.
తారాగణం : పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం :
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సీఈవో: చెర్రీ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి.