ఇదేం హిందుత్వం, లౌకిక దేశం అన్న జగన్ కామెంట్లను మనం ఎలా అర్ధం చేసుకోవాలి?? – ఇంతకీ హిందుత్వమంటే ఏంటి.. దాన్ని మనమెలా అవగతం చేసుకోవాలి ??? : Journalist Audi
జగన్ కి లడ్డూ విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిందనీ.. ఆయనిక కోలుకోవడం కష్టమనీ.. అదనీ- ఇదనీ చాలా మంది ఆయన మీద అవాకులు- చెవాకులు పేలుతున్నారు. వీరంతా గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఫస్ట్ ఆయన మీదున్న హిందూ వ్యతిరేక ముద్ర.. ఇప్పటిది కాదు. ఆయనకసలు హిందువుల్లో పెద్ద ఓటు బ్యాంకు కూడా లేదు. ఈ విషయంలో బీజేపీకి కూడా ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే తొలుత బాబును భూ స్థాపితం చేసి.. ఆపై జనసేనతో జతగట్టి, ఆపై 2029కి కూటమి కట్టి.. జగన్ కి పోటీగా రంగంలోకి దిగాలని భావించిందని అంటారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు.
నేటి 2024- ఎన్నికలు కావచ్చు, 2019- ఎన్నికలు కావచ్చు, అంతకన్నా ముందు 2014- ఎన్నికలు కావచ్చు.. జగన్ కి పడ్డ ఓటు బ్యాంకు బీజేపీది, హిందుత్వకు సంబంధించినది కానే కాదు.. పూర్తి కాంగ్రెస్ రిలేటెడ్ ఓట్ షేర్ అది. జగన్ రాజకీయ విధానం ప్రో- హిందుత్వ విధానం కాదు. ఆయన కల్ట్ క్లాసిక్ ఓటు బ్యాంకు కేం ఫ్రం.. ఎస్సీ\ ఎస్టీ\ బీసీ\ ముస్లిం\ క్రిస్టియన్\ మైనార్టీకి చెందినది. వీరిలో కూడా కొంత మేర ప్యూర్ హిందుత్వవాదులు ఉండొచ్చుగానీ అది విపరీత హిందుత్వ కానే కాదు. అసలేంటీ హిందుత్వ.. అంటే, దీన్నే కట్టర్ హిందు అంటారు. ఇలాంటి హిందువులంతా ఒక జట్టు కట్టి.. ఒకే మాటగా.. ఒకే బాటగా నడుస్తారు. వీరిలోని ఒక హిందువుకు ఇది కరెక్టు కాదు కదా? అనిపించినా కూడా వారా మాట పైకి అనకూడదు. అనడానికి వీల్లేదంతే!
ఇప్పుడు తిరుమల- లడ్డూ విషయంలో జంతు కొవ్వు కలిసిందంటే కలిసిందని అనాలి. అదో లెక్క. ఎందుకంటే వారొక అవకాశం కోసం చూస్తుంటారు. అలాంటి అవకాశం 1850ల కాలంలో మంగళ్ పాండే తూటాల్లో–కొవ్వును కనుక్కున్నట్టు.. ప్రస్తుతం ఇక్కడ కూడా అది పనిగా కావాలని వెంకన్న లడ్డూకి వాడే నెయ్యిలో కొవ్వు పాళ్లను కనుగొనడం జరిగింది. ఇదంతా ఒక ప్రీప్లాన్డేనని .. ఆ టెస్టు, దాని తేదీలను బట్టీ చూస్తుంటే ఇట్టే అర్ధమవుతోంది కదా!?
ఎప్పుడైతే ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ మాట వచ్చిందో.. ఆ వెంటనే నాస్తిక రాధాకృష్ణ.. ఒంటినిండా ఆస్తికత్వం పులుముకుని.. దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అని ఆ వెంకన్నను కొనియాడుతూ రాశాడు (అయినా దేవుడు ఎక్కడ లేడు.. సర్వాంతర్యామి అని అంటూనే అసలు తిరుమలకు మీరు కల్పించిన ప్రచారం వల్లేగా ఆయన దేవుడైందని దెప్పి పొడిచిన వాడు ఎవడవుతాడు? ఆస్తికుడా నాస్తికుడా?) జగన్ మహా పాతకం అంటూ ఒక కొత్త- చెత్త పలుకు పలకడం.. ఆపై పవన్ చేత ప్రాయిశ్చిత్త దీక్ష చేపట్టేలా చేయడం.( లడ్డూలో కొవ్వు కలిసింది తిరుమలలో అయితే దుర్గమ్మ కొండ మెట్లకు పసుపు కుంకాలు పెట్టడమేంటి?) ఇక ఏబీఎన్, టీవీఫైవ్, మహా వంటి చానెళ్లు, వాటి లింక్డ్ సోషల్ మీడియా.. ఇతరరత్రా పత్రికల ద్వారా.. ఊదరగొట్టించడం.. వీరిలో ఏ ఒక్కరూ కూడా వెంకన్న భక్తులు అసలే కాక పోవడం.. బ్రాహ్మణత్వమన్నా, దేవుడన్నా కనీస భయ భక్తులు లేని వారు కావడం.. వంటి అవలక్షణాలు వారిలో ఉన్నా. . అది పనిగా కావాలని వారు వాయిస్తున్న ఈ ఆందోళరాగానికి హిందువన్న ముద్ర పడ్డ ప్రతి ఒక్కరూ జై కొట్టి తీరాల్సిందే.. అయితే సాటి హిందువులుగా మనం గుర్తించాల్సిన అంశమేంటంటే.. పూనం కౌర్ చెప్పినట్టు బోత్ ఆర్ నాట్ సేమ్. హిందుత్వం మీద నమ్మకం ఉండటం వేరు- దాన్ని అడ్డు పెట్టుకుని ఇలా సన్నాయి నొక్కులు నొక్కడం వేరు వేరు.
లేకుంటే వెంకన్నను తమ ఇంటి ఆరాధ్య దైవంగా భావించే బాబు ఇదే అలిపిరి బ్లాస్టింగ్ తర్వాత గెలవాలి కదా? ఎందుకు ఓడినట్టు?? ప్రశ్నిస్తున్నారు కొందరు. అదే సమయంలో.. వైయస్ఆర్ ని ఆయన కుటుంబాన్ని తిరుమల తిరుపతి ఏడు కొండల స్వామి శపించాడనుకుంటే.. తండ్రీ కొడుకులిద్దరి చేత తనకు పట్టు వస్త్రాలు పెట్టేలా ఎందుకు చేస్తాడు?? మరి ఈ లాజిక్ మీరెలా మిస్సయ్యారు? అని నిలదీస్తున్నారు వీరు. మరి జగన్ కి అంత దైవ భక్తే ఉంటే.. ఇంత ఘోరంగా ఎందుకు ఓడినట్టు? మరి కొందరు నిలదీయవచ్చు.. మనల్ని సూటిగానే ప్రశ్నించవచ్చు కూడా. అయితే జగన్ నాలుగ్గోడల మధ్య చదువుతూ నమ్మే బైబిల్ చెప్పే సూత్రీకరణ ప్రకారం చూస్తే, దేవుడికి కోపం వచ్చినపుడు దుష్టులను పాలకులుగా చేసి.. జనానికి పరలోకం రాకుండానే అక్కడికక్కడ- నరక బాధలు పెడతాడట. మరి ఇలా ఎందుకు అనుకోవద్దని అంటారు వీరు.
ఇప్పుడిదంతా కాదండీ.. జగన్ తిరుమల పర్యటన రద్దు వెనకున్న ఉద్దేశమేంటి ? ఈ విషయంలో ఆయన వెనక్కు తగ్గినట్టా.. ముందుకెళ్లి నెగ్గినట్టా ?? దీన్ని తేల్చండి ముందని అడిగే వాళ్లుండొచ్చు. ప్రస్తుత పరిస్తితుల్లో జగన్ తిరుమలకు వెళ్తే.. తన మతమేంటో సూచిస్తూ… తొలుత డిక్లరేషన్ రాయాలి. ఎందుకంటే ప్రెజంట్ సిట్యువేషన్లో తాను పెద్ద పవర్ఫుల్ కాదు. అట్ లీస్ట్ కేబినేట్ ర్యాంక్ గల ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి.. ఆయనకీ డిక్లరేషన్ రాయక తప్పని దుస్థితి. ఎప్పుడైతే తాను డిక్లరేషన్ రాస్తాడో.. అప్పుడు తాను నిజంగా ఓడినట్టు లెక్క.
విజయమ్మ చెప్పినట్టు.. జగన్ రెడ్డి కానీ, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి కానీ పుట్టుకతో వచ్చిన క్రైస్తవులు. వారికి ఈ మతం పట్ల విశ్వాసం ఉన్నా లేకున్నా సరే, తప్పదీ బైబిల్ భారం. దీంతో వాళ్లు విధిగా బైబిల్ అనుసరణ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకూ వారికి బైబిల్ కావల్సినంత ఇచ్చింది. ఇంకా ఇంకా ఇస్తూనే ఉంటుంది కూడా. ఈ బైబిల్ సావాసం ద్వారానే వారికి ఎన్నో సామాజిక వర్గాల వారిని దగ్గరకు చేర్చింది. అది కాల క్రమేణా ఒక ఓటు బ్యాంకుగానూ మారింది. అలాంటి ఎన్నో స్థిరచరాస్తులు ఇచ్చిన బైబిల్ ని వారుగానీ, వారి కుటుంబం కానీ వదులుకునే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది.. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా? అన్నట్టు.. వైయస్ కుటుంబం క్రిస్టియన్లేనని ప్రపంచమంతా తెలిసినపుడు… తమకీ డిక్లరేషన్లు ఏలా అన్నది జగన్ అభిమతం. అందుకే ఆయన నా మతం మానవత్వం అంటూ కామెంట్ చేశాడని చెప్పాల్సి ఉంటుంది.
కాబట్టే.. జగన్, ఇదేం హిందుత్వం? ఇదేం లౌకిక దేశమని.. ప్రెస్ మీట్ పెట్టి మరీ హిందూ వ్యతిరేక కామెంట్లు గుప్పించారు. ఇదింకా పెద్ద తప్పు కాదా!? అంటూ మరి కొందరి ప్రశ్నాస్త్రం. అయితే ఇదే కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. సోషల్ మీడియా మొత్తం కలసి.. జగన్ని సరిదిద్దాలని ప్రయత్నిస్తోందిగానీ.. మొదట దిద్దుబాటు అంటూ ఒకటి మొదలు కావల్సి వస్తే.. అది హిందుత్వను దిద్దడం నుంచి మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ అన్నాడే.. ఇదే చర్చిలోగానీ, మసీదులోగానీ జరిగితే వారు ఊరుకుంటారా? అని, ఇది కూడా ఒక రకంగా కరెక్టే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరి హిందువులు మాత్రం ఎందుకిలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అంటే.. హిందువులు తొలి నుంచీ ఇక్కడ ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తూ వచ్చారు. గట్టిగా మాట్లాడితే ఇంకా ఆ కండీషన్లోనే ఉన్నారు.
కాజా గరీబ్ నవాబ్ రూపంలో ఇస్లామ్ ని, మదర్ తెరీసా వంటి వారి రూపంలో క్రైస్తవాన్ని యధేచ్చగా వదిలేశారు.. ఇదే అదనుగా భావించిన ఈ రెండు మతాలు తమ తమ శాయశక్తులా ప్రయత్నించి.. తీవ్ర మతమార్పిడికి పాల్పడ్డాయ్. దానికి తోడు హిందుత్వం ఏమైనా మరింత పటిష్టపరచబడిందా!? అంటే అందులోంచి కూడా మరిన్ని శాఖోపశాకలుగా చీలి జైన, సిక్కు, లింగాయత్ ఇలా పలు మతాలకు జన్మనిచ్చింది. దీంతో హిందుత్వం అన్నది ఒక మత విశ్వవిద్యాలయంగా ఫరడవిల్లింది. ప్రస్తుత పరిస్థితిని బట్టీ చూస్తే ఇదొక మతం కానే కాదు.. మతాలను పుట్టించే అతి పెద్ద రెలిజియస్ ప్యాక్టరీ కమ్ మార్కెట్.. ఇప్పటికీ హిందుత్వంలోంచి ఒక కొత్త మతం పుట్టించే అవకాశం భారీ ఎత్తున ఉందనడంలో అతిశయోక్తి లేదు.
మన దేశంలో.. ఎన్నేసి ప్రాంతాలు, ఎన్నేసి భాషలున్నాయో.. ఒక్క హిందుత్వలోనే అన్నేసి శాఖోప శాఖలున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ చేసింది ఒక్క ఆదిశంకరాచార్యుడే కానీ.. ఆ శంకరాచార్య పేరు పెట్టుకుని.. వారిలో వారికి పడని ఎందరో జగద్గురువులు చాలా మందే ఉన్నారు ఇప్పటికీ. మరి వీరంతా.. ఏకోమార్గంలో ఎందుకు నడవరు?? అద్వైతం.. అంటే రెండు కాదు- అంతా ఒక్కటే అన్నది ఆదిశంకర తత్వజ్ఞానం అయితే.. ఇది వీరికెందుకు పట్టదు??? ఇండియన్ రుపీ రేంజ్ క్వశ్చిన్ మార్క్(ఇది మిలియన్ డాలర్ కి భారతీకరణగా గుర్తించాలి). మన మూల సిద్దాంతంలోనే ఇంత వైరుధ్యం పెట్టుకుని మనమంతా జగన్ లాంటి హిందువేతరులనేదో సంస్కరించేల ఈ పోజులెందుకు? సరే… ఇలాంటి వారిలో ఎవరికైనా అసలు హిందుత్వం అంటే ఏంటో తెలుసా? అంటే, తెలీనే తెలీదని చెప్పాల్సి ఉంటుంది.
కారణం హిందుత్వం ఎవరికీ ఏ డబ్బు ఇచ్చి, ఏ ప్రచారమూ చేయించదు. హిందుత్వం ఎలాంటిదంటే.. ఎవరి పాపం- పుణ్యం వారిది. ఇది అచ్చం సిబిల్ రేటింగ్ లాంటిదే.. మీరు మంచిగా సదాచార పారాయణులైతే.. మీకంతా పుణ్యమే వస్తుంది. గొప్ప మేలు జరుగుతుంది. అదే ఆచార వ్యవహారాలను బొత్తిగా తప్పి సంచరిస్తే.. మీరు ఘోర పాపాత్ములవుతారు. అదంతా మీ మీ ఇష్టానుసారం ఆధార పడి ఉంటుందని అంటుంది హిందుత్వ భావజాలం!!! మన కర్మ సిద్ధాంతం కూడా అంతే ఇక్కడ పాప భీతి రాజ్యమేలుతుంది కానీ దేవుడు మతం కానే కాదు. అలాంటి సిద్ధాంతం ఒకటి ఉందని అనుభవంలోకి వచ్చి వారంతట వారు ధర్మాచార పారాయణులు కావాలి తప్ప.. ప్రత్యేకించి హిందుత్వాన్ని బలవంతానా.. అవలంభించమని ఎవ్వరూ చెప్పరు. నీకు కావాలంటే ఇదే జీవన విధానంలోంచి ఒక కొత్త మతాన్ని సృష్టిస్తే. అందుకు సగటు హిందువులు గర్వపడతారే గానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ.. బాధ పడరు.
అలాంటి హిందుత్వను ప్రస్తుతం వీరంతా కలసి బలవంత పెడుతున్నట్టుంది చూస్తుంటే.. హిందుత్వం అంటే ఒకరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుకున పెట్టరాదు. వారి మతం, అభిమతం వారిష్టం. మన హిందుత్వ స్ఫూర్తి నుంచే రాజ్యాంగం కూడా స్ఫూర్తి పొందిందని చెప్పాలి. అందుకంటూ ఒక చట్టం కూడా తెచ్చారు కాబట్టి వారి వారి మత స్వేచ్ఛ వారిది. ఈ విధానం.. మనకు హిందుత్వమే ప్రదానం చేసింది తప్ప.. ఇందులో మరెవరి తప్పు కూడా లేదు. కన్ ఫ్యూజియస్ చెప్పినట్టు హిందుత్వను అర్ధం చేసుకోవడం ఒక క్రిటికల్ థింకింగ్ కిందకు వస్తుంది.. మనమంతా కలసి మన పిల్లల్ని బీటెక్, ఎంటెక్ అంటూ కోర్సుల్లో చేర్చి తయారు చేసేదే ఈ డిఫికల్ట్ థింకింగ్ నేర్చుకుంటారని (ఆమాటకొస్తే మేథమెటిక్స్ ద్వారా అప్పటికప్పుడు లబ్ధి ఏదీ ఉండదు. ఇది కేవలం మన బ్రెయిన్ షార్ప్ నెస్ కి తోడ్పడేదే తప్ప..) కావాలనే రెండు రెండ్లు నాలుగు అంటూ సులభతరమైన విద్య ఎందుకు నేర్పరంటే.. ఇదే కారణం. అంత ఈజీగా మనకు ఆన్సర్ రావద్దు. ఇవాళ్రేపు ఏ బీటెక్ లేకుండానే భారీ ఎత్తున జీవితంలో ఎదగొచ్చు. కానీ ఎందుకని మనం బేసిక్ డిగ్రీ అన్నదొక నిబంధనగా పెడుతున్నాం అంటే అందుకు రీజన్ ఇదే!!! క్రిటికల్ థింకింగ్ నేర్చుకుంటారనే.
చైనీయులు తమ పిల్లల శరీరాన్ని ఎన్ని వంకరలు తిప్పి తయారు చేస్తారో.. మన భారతీయులు తమ తమ పిల్లల్ని అన్నేసి గందరగోళ సిద్ధాంత రాద్ధాంతాల మధ్య పెంచుతారు. దీని ద్వారా కష్టపడ్డ శరీరంగల చైనీయులు.. ఉత్పాదక రంగంలో మంచి ఫలితాలు సాధిస్తుంటే, భారతీయులు తాము చిన్ననాటి నుంచి అలవడ్డ క్రిటికల్ థింకింగ్ ద్వారా స్పేస్, సాఫ్ట్ వేర్, మెడికల్, లా వంటి సర్వీస్ సెక్టార్ లో అపార నైపుణ్యం కనబరిచేవారయ్యారు. ఇవన్నీ మనం అర్ధం చేసుకోవడం మానేసి.. కావాలని అది పనిగా.. జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి అహరహం శ్రమిస్తున్నాం. ఈ తరహా ఆలోచనా ధోరణితో జగన్ కి వచ్చే ఇబ్బందేం లేదు. ఇది కూడా ఒక స్ట్రాటజీనే. అచ్చం బీజేపీలాంటి స్ట్రేటజీనే.
అమిత్ షా హైదరాబాద్ వచ్చినపుడు.. తాము అధికారంలోకి వస్తే.. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామనడంతో.. నాలుగు ఎంపీ సీట్ల బీజేపీ- 8 ఎంపీ సీట్లకు ఎగబాకింది. ఒక అసెంబ్లీ సీటు కాస్తా.. ఎనిమిదింటికి ఎదిగిందని గుర్తించాలి మనం. ఇదెలా సాధ్యమైందంటే.. ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్లతో హిందూ ఓటు బ్యాంకు మరింత బలపడింది.. ఇది కూడా అంతే. జగన్ కి వీరంతా కలసి ఎంతో మేలు చేస్తున్నారనే చెప్పాలి. ఇప్పటి వరకూ జగన్ని చేజారిన హిందూ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం.. తిరిగి బలపడ్డానికి ఇదే అనువైన సమయం\ సందర్భం. కాబట్టి.. జగన్ కి ఏదో కీడు జరగబోతుందని తీవ్రంగా బాధ పడుతున్నవారంతా కలసి గుర్తించాల్సిన ది ఇదేనని నా భావన.
జగన్ని సరిదిద్దుతున్నామన్న భ్రమల్లో ఉన్నవారు.. ఫస్ట్ దీన్ని రికగ్నైజ్ చేయండి. అతడంతా తెలిసే చేస్తున్నాడు. తెలియక ఏమీ చేయడం లేదు. ఒక లాబ్ టెస్ట్ వచ్చి రెండు నెలల తర్వాత దాన్ని ఒక పథకం ప్రకారం బయటకు తీసి మరీ జగన్ మీద రుద్దడంలో ఎంత లోతైన వ్యూహముందో.. జగన్ కూడా అంతే వ్యూహాత్మకంగా, ఉద్దేశ పూర్వకంగానే ఇదంతా చేస్తున్నాడనే అనిపిస్తోంది. అతడేమీ అంత తేలికైన వాడు కాడు… ప్రపంచంలోనే అత్యంత కఠువైన రాటుదేలిన రాజకీయ ఉద్ధండుడైన చంద్రబాబు ఆయన పరివారగణం చేతే.. ఇతడు మాములోడు కాడన్న కామెంట్లు వచ్చేలా చేశాడంటేనే.. అర్ధం చేసుకోవచ్చు.. జగన్ పొలిటికల్ స్టామినా ఏపాటిదో. ఒక వేళ ఏదైనా జాలి పడాల్సి వస్తే.. మన మీద మనం జాలి పడాలి తప్ప.. జగన్ మీద కావాలని భావించాలని మనవి!!! ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్