దేవుడున్నాడు… ప్రజల ఆశీర్వాదమే మిగిలింది : వైఎస్ షర్మిల
లోటస్ పాండ్ లో గురువారం 33 జిల్లాల ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ప్రజలు తెలంగాణలో రాజన్న రాజ్యం కోరుకుంటున్నారన్నారు. వైయస్సార్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజు ఏప్రిల్ 9. ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజే మొట్ట మొదట అడుగు వేద్దాము. ఎవరు భయపడొద్దు. రాబోయే ఎన్నికల్లో మన వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనకు ఎవరితో పొత్తులు అవసరం లేదు. మనం టీఆర్ఎస్ చెప్తే వచ్చిన వాళ్ళం కాదు. బీజేపీ అడిగితే వచ్చిన వాళ్లం కాదు. మనకు ఎవరూ అవసరం లేదు. అని షర్మిల చెప్పారు.
NOTE : పార్టీ పెట్టలేదు. విధి విధానాలు తెలియదు. ఎవరు చేరతారో తెలియదు. ఎందుకు చేరతారో తెలియదు. రాజన్న రాజ్యం నమూనా ఏమిటో తెలియదు. అప్పుడే TS లో అధికారంలోకి రానున్నట్టు షర్మిలక్క చెబుతున్నారు. ఈ విషయం మీద మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేయండి.