పీడీ యాక్ట్ కింద అక్రమంగా అరెస్ట్ చేసిన శ్రీ రాజా సింగ్ విడుదల కోసం వందలాది బెయిల్ పిటిషన్స్ వేద్దాం: హిందూ సమాజానికి యుగ తులసి చైర్మన్ శ్రీ కె శివ కుమార్ పిలుపు
రాజాసింగ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.. హిందువులంతా వందలాది బెయిల్ పిటిషన్లు వేయాలి.. హైదరాబాద్ అల్లర్లకు కేసీఆర్, కేటీఆర్ ల కుట్ర, తెలంగాణ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టి హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం లేకుండా చేసింది. మునావర్ ఫారుఖి హిందు దేవుళ్లను కించపరిస్తే..ప్రభుత్వం , పోలీసులు కలిసి అనుమతిచ్చారు. నాస్తికుడు కేటీఆర్.. ఈ కామెడీ ని ఎంజాయ్ చేసాడు. ధర్మం కోసం పోరాడే ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఈ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టడం దారుణం.
ఈ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తుందనడానికి ఇదే నిదర్శనం. రాజసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. త్వరలో రాజసింగ్ ను చర్లపల్లి జైల్లో కలుస్తాం. బంగారు తెలంగాణ లో మంటలు రేపుతోంది.. కేసీఆర్ ప్రభుత్వం. హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. హిందువులంతా రాజసింగ్ కోసం వందలాది బెయిల్ పిటిషన్లు వేసి మన ఐక్యతను చాటాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కుట్రలో భాగమే. హైదరాబాద్ లో అల్లర్లు. ఒవైసీ బ్రదర్స్ ని హైదరాబాద్ నుండి తరమికొట్టే రోజులు రాబోతున్నాయి.
గో వధ నిషేధ చట్టాల అమలు కోసం నిరసనలు చేస్తే.. ఎన్నిసార్లు అడిగినా అనుమతి ఇవ్వలేదు. ధర్మం కోసం పోరాటం చేస్తున్న రాజసింగ్ కు మద్దతుగా స్వామీజీలు స్పందించాలి. హిందువుల పై దాడులు చేస్తే.. అక్రమ కేసులు పెడితే.. జైళ్లు, పోలీస్ స్టేషన్ లు నిండిపోతాయ్. కానీ మా ధర్మం కోసం పోరాటం ఎప్పటికి కొనసాగుతుంది.