Zaheerabad MP BB Patil Donated 10 Oxygen Concentrators to Zahaeerabad Constuency, Calvary Temple, Minister Harish Rao, Covid isolation Centers, Telangana Covid News,
జహీరాబాద్ ఎంపీ శ్రీ బి.బి.పాటిల్, మంత్రి శ్రీ హరీష్ రావు గారి సమక్షంలో తన సొంత ఖర్చుతో ఐదు లీటర్ల కెపాజిటి గల 10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకి విరాళంగా ఇచ్చారు.
ఈ రోజు గౌరవ జహీరాబాద్ ఎంపీ శ్రీ బి.బి.పాటిల్ గారు తన సొంత ఖర్చుతో ఐదు లీటర్ల కెపాజిటి గల ఒక్కటి రూ. 50 వేలకు పైగా విలువ చేసే
10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ జహీరాబాద్ నియోజకవర్గంకి విరాళంగా గౌరవ ఆర్ధిక శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సమక్షంలో ప్రభుత్వ వైద్య అధికారులకు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు గారు ఎంపీని ప్రత్యేకంగా అభినందించి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అందించడం పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఐదు లీటర్ల కెపాజిటి గల ఒక్కోదాని ఖరీదు 50 వేలకు పైగానే అని మంత్రి తెలిపారు.
ఈ మిషన్ గాల్లోని ఆక్సిజన్ తీసుకుని అత్యవసర పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పేషంట్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ సంధర్భంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతు ప్రజాశ్రేయస్సు కొరకు తను నిరంతరం అందుబాటులో ఉంటాను ప్రజాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటాం గతంలో కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు, హోమియోపతి మెడిసెన్స్ ఇలాంటి కార్యక్రమాలు ప్రజల కొరకు చేశాను ఇంకా చేస్తూనే ఉంటాను, పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెయ్యడంలో భాగంగా నియోజకవర్గం ప్రజల ఆరోగ్యంను కాపాడడం కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవడంలో తన పోరాటం ఆగదు అన్నారు.
ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గం లో కరోన మహమ్మారిని అరికట్టేందుకు నియోజకవర్గం శ్రేయస్సు కొరకు 100 పడకల కోవిడ్ ఐసోలేషన్ ఆసుపత్రి కల్వరి టెంపుల్ అధినేత సతీష్ గారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ పరిద్ధోద్దీన్, స్థానిక తెరాస నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.