జాతీయ అవార్డ్ గ్రహీత వసంత్ బాలన్ దర్శకత్వంలో సిరీస్‌ను రూపొందించిన రాధికా శరత్‌కుమార్… మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్
మే 4, నేషనల్ : భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం ZEE5. పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ రూపొందించారు.
ఇందులో కిషోర్, శ్రియారెడ్డి, ఆదిత్య మీనన్, భరత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనలను తెలియజేసే కథాంశంతో ఇది తెరకెక్కింది. ఇది తమిళ రాజకీయాల చుట్టూ నడిచే కథాంశం. ముఖ్యమంత్రి అరుణాచలం అవినీతి ఆరోపణలతో 15 సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటుంటారు. ముఖ్యమంత్రి కావాలని, ఆ పదవి కోసం వారిలో ఇది కోరికను మరింతగా పెంచుతుంది.
ఇదిలా ఉండగా జార్ఖండ్‌లోని మారుమూల పల్లెటూరులో, రెండు దశాబ్దాల క్రితం జరిగిన పాత మర్డర్ కేసుని సీబీఐ ఆఫీసర్ వాన్ ఖాన్ పరిశోధిస్తుంటారు. అదే సమయంలో చెన్న నగనంలో తల, శరీరభాగాలు వేరు చేయబడిన ఓ శరీరం దొరుకుతుంది. ఈ భయంకర ఘటనకు కారకులైన వారిని కనిపెట్టటానికి చెన్నై డీజీపీ మణికందన్ పరిశోధన చేస్తుంటారు. క్రమక్రమంగా నగరంలో జరరగుతున్న ఈ దుర్ఘటనల వెనుకున్న నిజమేంటనేది బయటకు వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.