Entertainment ఓటీటీ ప్లాట్ఫామ్లులో ఏమాత్రం తేడా లేకుండా ఉత్తరాది దక్షిణాది చిత్రాలు అన్నిటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు… తాజాగా ఐఎమ్‌డీబీ విడుదల చేసే లిస్ట్‌లను చూస్తే ఉత్తరాది ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయిందని అనిపిస్తుంది.. ఈ లిస్టులో సౌత్ ఇండియా కి చెందిన ఒక స్టార్ హీరో నెంబర్ వన్ స్థానంలో ఉండటం ప్రస్తుతం వైరల్ గా మారింది..
తాజాగా 2022 సంవత్సరానికి గానూ ఐఎమ్‌డీబీ అత్యంత ప్రజాదరణ కలిగిన ఇండియన్ యాక్టర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా విడుదలైన ఈ లిస్టులో ఎవరు ఊహించిన విధంగా తమిళ హీరో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.. తమిళ్ హీరో ధనుష్ హిందీ తెలుగు స్టార్ లందర్నీ వెనక్కి నెట్టి ముందు స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత బాలీవుడ్ నటి అలియా భట్ ఉండగా మూడో స్థానంలో ఐశ్వర్యారాయ్ ఉంది.. అలాగే ఆ తర్వత నాలుగో స్థానంలో మన టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ఉన్నాడు… మిగిలిన స్థానాల్లో సమంత, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనీయర్ ఎన్టీరామారావు, అల్లు అర్జున్, యశ్ నిలిచారు.. అలాగే ఐఎమ్‌డీబీ హైఎస్ట్ రేటెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్‌లోనూ సౌత్ సినిమాలు సత్తా చాటాయి. అత్యంత ఎక్కువ రేటింగ్ పొంది ‘‘777 చార్లీ’’ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.. తర్వాత స్థానంలో రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ నిలిచింది. తర్వాత స్థానాల్లో కేజీఎఫ్: ఛాప్టర్, విక్రమ్, పొన్నియన్ సెల్వన్, కాశ్వీర్ ఫైల్స్, మేజర్, డాక్టర్ జీ, ఆర్ఆర్ఆర్, ఏ ధర్స్డే నిలిచాయి.






















