సైబరాబాద్ పరిధిలో నవంబర్ నెలలో 6824 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయడం జరిగినది. ఫలితంగా మద్యం మత్తులో జరిగే ప్రమాదాలలో పెద్ద సంఖ్యలో తగ్గుదల కనిపించింది. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి పెద్ద సంఖ్యలో సిబ్బంది ద్వారా డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ లను నిర్వహిస్తున్నాము.
అలాగే రెండు, మూడు పోలీస్ స్టేషన్ అధికారులను కలిపి మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ లను కూడా నిర్వహించడం జరిగింది. ఈ నెలలో 6824 నమోదు చేయగా అందులో 93 మందికి జైలు శిక్ష పడగ, 2,37,25,000/- జరిమానా విధించారు.