హైదరాబాద్ : పూటకో పార్టీ మార్చే నటి జీవిత తెరాస నాయకులపై ముఖ్యంగా కెసిఆర్ గారి కుటుంబసభ్యులపై చేస్తున్న విమర్శలని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.
సినిమాలో స్క్రిప్ట్ చదివినట్టు రాజకీయ ఉపన్యాసాలు కూడా చదివే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని , ఎమ్మెల్సీ కవిత గారి పై వచ్చిన ఆరోపణలని ఖండిస్తూ ఎటువంటి విచారణకైనా సిద్ధమని ఎప్పుడో చెప్పారని నటి జీవితకు గుర్తు చేశారు.
తెరాస నాయకులు, ముఖ్యంగా కెసిఆర్ గారి కుటుంబసభ్యులు హీరోలు కాబట్టే నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్ర ఏర్పాటుకోసం అలుపెరుగని పోరాటం చేసారని గుర్తు చేశారు. మీరు జీరోలు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటె వారితో జతకట్టి కనీసం ఒక్క ప్రజా సమస్యపైన పోరాటం చేశారా అని ప్రశనించారు ?
సాటి మహిళగా కవిత గారి ఇంటి మీదికి బిజెపి గుండాలు వెళ్లి దాడి చేస్తే ఖండించే సంస్కారం లేదు కానీ, బిజెపి నాయకుల మెప్పు కోసం పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్తారని జీవితను హెచ్చరించారు.
మంత్రి కేటీఆర్ గారి మీద విమర్శలు చెయ్యడం కాదని దమ్ముంటే బిజెపి కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతో విచారణ జరిపించాలని , జీవిత రాజకీయ అజ్ఞానం ఇక్కడే తెసులుస్తుందని ఎక్కడైనా అవినీతి ఆరోపణలు చేసే బదులు బిజెపి ఆధీనంలోని కేంద్ర సంస్థలతో విచారణ చేయించొచ్చు కదా అని ప్రశ్నించారు .
ఇప్పటికైనా స్క్రిప్ట్ ఉపన్యాసాలు కాకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెప్తారని అనిల్ హెచ్చరించారు.