Health ఈరోజుల్లో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోయే సమస్య వేధిస్తుంది అయితే ఇందుకుగాను చాలామంది ఎవరేం చెప్పినా వాటిని పాటిస్తూ ఉంటారు ఎక్కడో ఏవో చూసినా చదివిన ఎవరేం చెప్పినా వాటిని మనం ఉపయోగించడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.. అయితే జుట్టు విషయంలో చేయకూడని కొన్ని తప్పులు ఏంటో తెలుసుకుందాం..
ముఖ్యంగా చాలామంది జుట్టు కండిషనర్ అవుతుందని తేనె, పెరుగు, నిమ్మకాయ వంటివి హెన్నాల ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి కొంతవరకు ఉపయోగించిన ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కానీ మితిమీరి వాడితే మాత్రం చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చే ప్రమాదం ఉంది.. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా తలకు తగిలించరాదు.. అలాగే జుట్టుకు ఏం అప్లై చేసినా దాని కంటే ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అరగంట నుంచి గంటలోపే తలస్నానం చేయడం చాలా మంచిది… అంతకుమించి నాలుగు ఐదు గంటలు తల పైన ఉంచితే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది..
తరచూ డాండ్రఫ్ వేధిస్తుంటే నూనెను ఎక్కువగా వాడరాదు.. డాండ్రఫ్ కు ఆముదం అనేది చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు.. నూనెలో ఆముదం కలిపి తలకు రాసుకుంటే మంచి ఫలితం ఉన్నా ఆముదం ఎంపిక సరిగా లేకపోతే సమస్య మరింత తీవ్రమౌతుంది..