న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యానివర్సరీ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు. హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రుషిక గారు ఈ సెంటర్ ను ఎంతో డెడికేటెడ్ గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. పెరాలసిస్ వచ్చిన వారు, రోడ్ యాక్సిడెంట్ లో బెడ్ కు పరమితమైన వారిని చిన్న పిల్లల్లా చూసుకుంటున్నారు. నాకు ఈ సెంటర్ స్టాఫ్ ను చూస్తుంటే దేవతల్లా అనిపించారు. అంత గొప్ప సేవలు తక్కువ ధరల్లో అందిస్తున్నారు. రుషిక గారి ఆధ్వర్యంలో ఇదే అంకితభావంతో న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ సేవలు అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చే వారందరికీ మంచి జరగాలి. అన్నారు.
వి .వి రుషిక గారు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో కూడా చాలా సేవలు చేసారు అని కొనియాడారు . కోవిడ్ ఫస్ట్ వేవ్ లో కూడా దాదాపు 100 -150 మందికి ఉచితంగా కోవిడ్ టీకాలను పద్మజ హాస్పిటల్ నుంచి వేయించారు అని పేర్కొన్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో టీకా ఉచితంగా వెయ్యడం అంటే మాములు విషయం కాదని అయన అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ పై మక్కువ తో ఆమె ఒక డైరెక్టర్ గా ఉంటూ అలాగే ఈ హాస్పిటల్ లో కూడా బిజీగా ఉండడం చాల మంచిది. పద్మజ గారు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని శ్రీకాంత్ గారు అన్నారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్