Health తరచుగా తలస్నానం చేయకండి. ఇలా చేయడం వల్ల జుట్టు మరింత పొడవారే అవకాశం ఉంది. దీనివల్ల జుట్టు చిగుళ్ళకు సరైన కండిషనింగ్ అందక పగిలిపోయే అవకాశం ఉంది. కనీసం రెండు నెలలకు ఒకసారి జుట్టు చిగుళ్ళని పరిశీలించుకుంటూ పగిలిన జుట్టును కత్తిరించాలి.
సరిగా క్లీన్ చేయకపోవచ్చు.. చాలామంది జుట్టుకు షాంపూను పెట్టిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయరు. షాంపూ మొత్తం పోయేంతవరకు నీటితో కడగాలి… లేకపోతే త్వరగా తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నేరుగా జుట్టు షాంపును అప్లై చేయడం కూడా మంచిది కాదు. నీటిలో కలిపి తలకు పట్టించాలి. అత్యంత వేడి లేదా చల్లని నీళ్లతో తల స్నానం చేయడం అంత మంచిది కాదు. ఇవి జుట్టును మరింత పాడు చేసే అవకాశం ఉంది. అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. దీనివల్ల జుట్టు చిగుళ్ళుకు రక్త ప్రసరణ మంచిగా అయ్యి జుట్టు పెరుగుతుంది.
తల స్నానం చేయటానికి ముందు కచ్చితంగా కొబ్బరి నూనెతో జుట్టును మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల జుట్టు సహజ సిద్ధంగానే కండిషనర్ అవుతుంది. తరచూ జుట్టుకు రంగు వేయడం వల్ల సహజ సిద్ధంగా విడుదలయ్యే నూనెల ఉత్పత్తి తగ్గిపోయి జుట్టు పొడిబారిపోతుంది. అధిక గాఢత ఉన్న షాంపూలతో తలస్నానం చేయరాదు.. అలాగే తల స్నానం చేసిన వెంటనే జుట్టును సహజ సిద్ధంగా ఆరనివ్వాలి..


























