Entertainment ఆకాశంలో ఒక తార అంటూ సినీ ప్రపంచాన్ని ఊర్రూతలూగించిన నటుడు కృష్ణ. అలాంటి ఆయన సినీ ప్రపంచాన్ని దుఃఖ సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణాన్ని ఘట్టమనేని కుటుంబంతో పాటూ తెలుగు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవలు సితార గౌతమ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని ఉంచారు.. ప్రస్తుత ఆ పోస్ట్ వైరల్ గా మారింది..
సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితరలకు నానమ్మ, తాతయ్య తో ఎంతో అనుబంధం ఉంది. మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే గౌతమ్ చిన్నవాడిగా ఉన్నప్పుడు నమ్రత తల్లిదండ్రు ఇద్దరు అత్యంత తక్కువ గ్యాప్ లోనే చనిపోయారు దీంతో మహేష్ బాబు పిల్లలు ఇద్దరు కృష్ణ ఇందిరాదేవితో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.. ప్రస్తుతం కృష్ణ మరణంతో కృంగిపోయిన గౌతమ్ సితారలో తాతగారి పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు..
“నువ్వు ఎక్కడ ఉన్నా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటావని నాకు తెలుసు. చెప్పలేనంతగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్న, మిస్ యూ తాత గారూ.. ” – గౌతమ్..
“వీకెండ్స్ లో లంచ్ మళ్ళీ ఎప్పటిలా ఉండదు. నువ్వు నాకు చాలా విలువైన విషయాలు నేర్పావు. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నావు. ఇప్పుడు మిగిలింది నీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో. ఏదో ఒక రోజు నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ.. ” – సితార